
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మద్యం కోసం ఓ వ్యక్తిపై మేక దాడి చేసే వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.
ఈ మధ్య కాలంలో మనుషులే కాదు.. జంతువులు కూడా చుక్కకు అలవాటు పడ్డాయి. మద్యం తాగకపోతే జనాలు పిచ్చి పిచ్చిగా వ్యవహరించినట్లు జంతువులు కూడా వ్యవహరిస్తున్నాయి. తాజాగా మద్యానికి బానిసగా మారిన మారిన మేక ... మందు పోయకపోయే సరికి మనుషులపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే..
ఇద్దరు స్నేహితులు కలిసి ఇంటి బయట కూర్చుని బీర్ పార్టీ చేసుకుంటున్నారు. బీరు సీసాలు ఖాళీ చేస్తూ ఇద్దరూ ఎంజాయ్ చేశారు. సందడ్లో సడేమియా మాదిరిగా వారి మధ్యకు ఓ మేక వచ్చింది. దానికి పోయకుండా వారే సేవించడంతో.. మేకకు కోపం వచ్చింది. ఇక అంతే మందు ఎక్కువైన వారు కొట్టుకున్నట్లు మేక అతనిపై దాడి చేసింది. అంతే కాదు, ఆ వ్యక్తి తప్పించుకోవడానికి పరిగెత్తినప్పుడు, మేక కూడా అతన్ని పరిగెత్తేలా చేసింది.
కొమ్ములతో దాడి
మేక తనకు కూడా పెగ్గు వస్తుందని ఆశతో వారి వద్దకు వెళ్లింది. కానీ ఆ వ్యక్తి తన ముందు గ్లాసులో బీరు పోసుకొని తాగాడు. అయితే మేకకు ఇవ్వకుండా బీరు తాగడం ప్రారంభించడంతో మేకకు కోపం వచ్చింది. ఇక అంతే నాలుగడుగులు వెనక్కువేసి .. పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్లి కొమ్ములతో దాడి చేసింది. దీంతో అతను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోయాడు
మద్యపానం ఆరోగ్యానికి హానికరం. దీని వినియోగం వల్ల మనిషికి అనేక రకాల వ్యాధులు వస్తాయి. ఈ కారణంగా ప్రజలు మద్యానికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అయినా కొంతమంది మద్యానికి బానిసలవుతున్నారు. అయితే మద్యాన్ని ఇష్టపడే మేక వీడియో వైరల్ అవుతుంది.