
మామూలుగానే మేకలు పిరికివి. అదిలిస్తే అదురుతయ్. కోతిని చూసినా.. తొండని చూసినా బెదురుతయ్. కానీ తిండి కోసం ఆకాశాన్ని తాకే కొండలను కూడా ధైర్యంగా ఎక్కుతయ్. ఇటలీలోని పీడ్ మాంట్ నేషనల్ పార్క్‌లో ఇలా ఎన్నో మేకలు మేత కోసం వేల అడుగుల ఎత్తు ఉన్న కొండలు ఎక్కుతయ్. ఇలా మేస్తూ వెళ్లే క్రమంలో వాటిలో కొన్ని కిందపడి చనిపోతాయి కూడా! ప్రాణాలకు తెగించి విట్టోరియో అనే ఫొటోగ్రాఫర్ తన స్నేహితుడు ఆల్డో కోస్టాతో కలసి పీడ్ మాంట్ కొం డలను ఎక్కి ఈ మేక పాట్లను తన కెమెరాలో బంధించాడు. మేత మేస్తూ కొండ పైకి ఎక్కేసిన మేక అక్కడి నుంచి మళ్లీ కిందికి వెళ్లలేక బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉండిపోయింది.