''గాడ్ ఫాదర్''కు అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి

''గాడ్ ఫాదర్''కు అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి

ఇండియన్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు మెగాస్టార్లు  చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్'. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.  కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై తెరకెక్కిన గాడ్ ఫాదర్ దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొంది. ఈ నేపధ్యంలో నిర్మాత ఎన్వీ ప్రసాద్ ''గాడ్ ఫాదర్'' గ్రాండ్ సక్సెస్ ను విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు. 

''గాడ్ ఫాదర్'' బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.. కలెక్షన్స్ ఎలా వున్నాయి ? 
ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అద్భుతమైన కలెక్షన్స్ వున్నాయి. సినిమాని ఎవరికీ అమ్మలేదు. మేము సొంతంగా విడుదల చేశాం. రెవెన్యూ చాలా స్ట్రాంగ్గా వుంది. 

ఇంత భారీ నెంబర్స్ ఊహించారా ? 
కలెక్షన్స్ మేము ఊహించిన దాని కంటే అద్భుతంగా వున్నాయి. లూసిఫర్ను అందరూ చూశారు. అలాంటి సినిమాని రీమేక్ చేయడం ఒక సాహసం. సినిమాలో మార్పులు చేసి విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఓవర్సీస్తో పాటు హిందీ కలెక్షన్స్ కూడా బలంగా వున్నాయి. హిందీలో మొదటి వారం 10 కోట్లు రెవెన్యూ కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదు. తమిళనాడులో పోన్నియిన్ సెల్వన్ అద్భుతంగా ఆడుతోంది. అది వారి కల్చర్ మూవీ. వారి కల్చర్ మూవీకి గౌరవం ఇచ్చి అక్కడ గాడ్ ఫాదర్ రిలీజ్ నిలిపేశాం. అక్టోబర్ 14న తమిళనాడులో గాడ్ ఫాదర్  గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం.

చిరంజీవిని కలిసినప్పుడు గాడ్ ఫాదర్ విజయంపై ఏమన్నారు ? 
సక్సెస్ మీట్లో మేమందరం మాట్లాడాం. సమిష్టి కృషితో సినిమా చేశాం. చాలా సాహసంతో కూడిన సినిమా ఇది. ప్రేక్షకులకు కావాల్సిన వినోదం ఇచ్చాం. మేము ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. నిర్మాణ సంస్థగా చాలా ఆనందంగా వుంది. ఒక గొప్ప విజయం ఇచ్చిన తృప్తి మాకు కలిగింది. గాడ్ ఫాదర్ విజయం పట్ల మేము చాలా గర్వంగా ఫీలౌతున్నాం. మా బ్యానర్ కి గాడ్ ఫాదర్ ఓ మైల్ స్టోన్. రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలు తీయడానికి ఈ సక్సెస్ ఆక్సిజన్లా పని చేసింది. యూనిట్ పడ్డ కష్టానికి తగిన ఫలితం ప్రేక్షకులు గొప్ప విజయం రూపంలో ఇచ్చారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్షన్ రాబట్టింది? 
తెలుగు రాష్ట్రాల్లో రూ.60 కోట్ల షేర్ వచ్చింది. విదేశాల్లో కూడా కలెక్షన్స్ బలంగా వున్నాయి. ఒక్క అమెరికాలోనే 2 మిలియన్ టచ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ అద్భుతంగా వున్నాయి. 

రామ్ చరణ్ స్పందన ఎలా వుంది? 
చరణ్ బాబు ఆలోచన వల్లే ఈ సినిమా మొదలైంది. విడుదల తర్వాత రామ్ చరణ్ ఆనందం మాటల్లో చెప్పలేం. ఆయన సొంత సినిమా కంటే ఎక్కువ ఆనందపడ్డారు. 

చిరంజీవి సినిమా అంటే పాటలు, డ్యాన్సులు వుంటాయి కదా..అవి లేకుండా సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా?
తెలుగు సినిమాకి పాటలు, అద్భుతమైన డ్యాన్స్ పరిచయం చేసింది చిరంజీవి.  ఎంతో మంది ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఒక కొత్త తరహాలో చిరంజీవిని చూపించాలని ఒక ఛేంజ్ ఓవర్ ఫిలిం చేశాం. దీనికి ప్రేక్షకులు ఆశీర్వదించారు. ఇది పెద్ద మార్పుకు సంకేతం. 

దర్శకుడు మోహన్ రాజా గురించి? 
మోహన్ రాజా చాలా హార్డ్ వర్క్ చేసి అద్భుతమైన మార్పులు చేశారు. థమన్ కూడా అద్భుతమైన మ్యూజిక్ తో సినిమాకి ఆరో ప్రాణంగా నిలిచారు. 

దసరా, దీపావళి మధ్య గాడ్ ఫాదర్ ఒక బ్రిడ్జ్ లా నిలిచింది కదా? 
గాడ్ ఫాదర్ వంటి విజయం ఇండస్ట్రీకి అవసరం. ఇలాంటి విజయాలు వచ్చినప్పుడే ఎగ్జిబిటర్ వ్యవస్థ వుంటుంది. ఎగ్జిబిటర్స్ అందరికి  కూడా ఒక పండగలాంటి సినిమా గాడ్ ఫాదర్. 

టికెట్ ధరలు పెంచకపోవడం కూడా కలిసొచ్చిందా? 
టికెట్ ధరలు పెంచాలనే ఆలోచన మొదటి నుండి లేదు  మన సినిమాలకి మన ఆడియన్స్ కు ఈ రేట్లు సరిపోతాయి. గాడ్ ఫాదర్ ఎగ్జిబిటర్లు అందరూ చాలా ఆనందంగా వున్నారు. కోవిడ్ నుండి కూడా ఇండస్ట్రీ  దాదాపు బయటపడింది. ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకొని వారి అభిరుచి తగిన కథలు ఎంపిక చేసుకోవాలి.