ప్రపంచవ్యాప్తంగా ‘గాడ్జిల్లా’ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో ముప్ఫై తొమ్మిది సినిమాలు వచ్చాయంటే ఈ సినిమాలకున్న ఫ్యాన్ బేస్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మూడేళ్ల క్రితం వచ్చిన ‘గాడ్జిల్లా మైనస్ వన్’ సెన్సేషన్ సృష్టించగా దీనికి సీక్వెల్‌గా ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ వచ్చింది. టోహో సంస్థ నిర్మించిన ఈ జపనీస్ చిత్రానికి తకాషి యమజాకి దర్శకత్వం వహించారు. ఈనెల 6న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఉత్తర అమెరికా బాక్సాఫీస్ దగ్గర మన ఇండియన్ సినిమా ‘రామాయణ’ను వెనక్కు నెట్టి టాప్ ప్లేస్‌ను అందుకుంది.
శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ చిత్రానికి 31.6 మిలియన్ డాలర్లు వసూళ్ళు రాగా, ‘రామాయణ’ 8.7 మిలియన్ డాలర్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. అదీకాక ‘రామాయణ’ చిత్రాన్ని 210 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2000 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కించగా, అందులో తొమ్మిదో వంతయిన 19 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ను తెరకెక్కించారు. ‘గాడ్జిల్లా’ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్‌తో పాటు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక వీకెండ్‌కు వరల్డ్ వైడ్‌గా ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ 63 మిలియన్ డాలర్స్ రాబట్టగా, నాలుగు రోజుల్లో ‘రామాయణ’ చిత్రం 55 మిలియన్ డాలర్స్ (సుమారు రూ.500 కోట్లు) వసూలు చేసింది. అందులో 30 మిలియన్ డాలర్స్ మనదేశంలోనే వచ్చాయి.
