రూ.60 వేల దిగువ‌కు ప‌డిన బంగారం ధ‌ర‌

రూ.60 వేల దిగువ‌కు ప‌డిన బంగారం ధ‌ర‌

శ్రావణ మాసం.. అందులో పెళ్లిళ్ల సీజన్ ఇంకేంటి..బంగారానికి భలే డిమాండ్. జనాలు బంగారం, వెండి భారీగా కొంటారు. దీంతో బంగారం ధర రోజు రోజుకు భారీగా పెరుగుతుందేమోననుకుంటారు ప్రజలు. కానీ దీనికి భిన్నంగా పెళ్లిళ్ల సీజన్ అయినా కూడా  కొన్ని వారాలుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల పసిడి(22 క్యారెట్లు) ధర రూ. 54, 450గా ఉండగా.., 24 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) ధర 59, 400 లకు పడిపోయింది.

హైదరాబాద్లో ఎలా ఉందంటే..

హైదరాబాద్​లో మంగళవారం (ఆగస్టు 29) 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 54,500 కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59,450గా పలుకుతోంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. కిలో రూ.80,000 కి చేరుకుంది. 

ఢిల్లీలో..

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం(ఆగస్టు 29) భారీగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,000 గాను 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,000గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​59,020 గా ఉంది.  ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.