దసరా తర్వాత బంగారం రేట్లు పెరిగాయా.. తగ్గాయా..!

దసరా తర్వాత బంగారం రేట్లు పెరిగాయా.. తగ్గాయా..!

2023 అక్టోబర్ 2వ తేదీన  దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 56 వేల 960కు చేరుకోగా,  10 గ్రాముల 24  క్యారెట్ల బంగారం ధర రూ. 170 పెరిగి రూ. 62  వేల 120కు చేరుకుంది.  అయితే దసరా పండుగ (అక్టోబర్ 23)  నుంచి ఇవాళ్టి వరకు  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.  550 రూపాయలు పెరిగింది.  ఇక 10 గ్రాముల 24  క్యారెట్ల బంగారం ధర రూ.680 పెరిగింది.  ఇక దేశవ్యాప్తంగా ఈ రోజు  బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 

దేశ రాజధాని ఢిల్లీలో  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56 వేల 950గా ఉండగా,  10 గ్రాముల 24  క్యారెట్ల బంగారం ధర రూ.  62 వేల 110 గాఉంది.  ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56 వేల 800 గా ఉండగా,  10 గ్రాముల 24  క్యారెట్ల బంగారం ధర రూ.  61  వేల 960 గాఉంది.  .

Also Read :- ఏసీసీ లాభం 3 వందల 88 కోట్లు

ఇక హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56 వేల 800 గా ఉండగా,  10 గ్రాముల 24  క్యారెట్ల బంగారం ధర రూ.  61 వేల 960 గాఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56 వేల 800 గా ఉండగా,  10 గ్రాముల 24  క్యారెట్ల బంగారం ధర రూ.  61 వేల 960 గాఉంది.

మరోవైపు  వెండి ధరలు నిన్నటికి ఈ రోజుకు రూ.  500 తగ్గాయి.  ప్రస్తుతం మార్కెట్ లో  కేజీ వెండి రూ.  77 వేల 550 గా ఉంది.