V6 News

మెల్లమెల్లగా దిగి వస్తున్న బంగారం.. హైదరాబాద్లో తులం ధర ఎంతంటే..

మెల్లమెల్లగా దిగి వస్తున్న బంగారం.. హైదరాబాద్లో తులం ధర ఎంతంటే..

ఇరాన్–అమెరికా యుద్ధం కారణంగా కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు మెల్లమెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనిశ్చితి కారణంగా.. ట్రంప్ టారిఫ్స్, రోజు రోజుకూ చేస్తున్న కామెంట్స్ తో.. పెట్టుబడులకు సేఫ్ బెట్ గోల్డ్ అని ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు భారీ ఎత్తున బంగారం నిల్వలు పెంచుకున్నాయి. దీంతో భారీగా పెరిగిన గోల్డు రేట్లు.. సమాన్యులకు అందనంత దూరం వెళ్లాయి. అయితే ఇటీవలి పరిణామాలతో.. ఏప్రిల్ నెల రెండో భాగంలో బంగారం తగ్గుతూ వస్తోంది. 

2026 ఏప్రిల్ 28వ తేదీన హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం.. గ్రాముకు 71 రూపాయలు తగ్గింది. దీంతో తులం (10 గ్రా) బంగారం ధర రూ.లక్ష 53 వేల దగ్గర ఉంది. 

  • హైదరాబాద్లో గోల్డ్ రేట్లు:

24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రా)  ధర రూ.1,53,000 గా ఉంది. సోమవారంతో పోల్చితే 710 రూపాయలు తగ్గింది. 

22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.1,40,250 దగ్గర ఉంది. సోమవారం తో పోల్చితే 650 రూపాయలు తగ్గింది. 

ALSO READ : ఐటీలో మరోసారి లేఆఫ్స్ కలకలం..

దాదాపు ఇండియాలో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు మొదలైన నగరాల్లో బంగారం తులం ధర దాదాపు 700 వరకు తగ్గడం గమనార్హం. 

  • వెండి ధరలు:

వెండి ధరల్లో కూడా పెద్దగా చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదు. హైదరాబాద్ లో గ్రాముకు 5 రూపాయలు తగ్గుదల కనిపించింది. అంటే కేజీ వెండి ధర 5 వేల రూపాయలు తగ్గినట్లు. కేజీ సిల్వర్ సోమవారం (ఏప్రిల్ 27) 2 లక్షల 70 వేలు ఉండగా.. మంగళవారం 5 వేలు తగ్గడంతో 2 లక్షల 65 వేల రూపాయలద దగ్గర కొనసాగుతోంది.