హైదరాబాద్ లో బంగారం వ్యాపారి కిడ్నాప్

హైదరాబాద్ లో బంగారం వ్యాపారి కిడ్నాప్

హైదరాబాద్ : చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్ లో ఓ బంగారం వ్యాపారిని నిన్న రాత్రి కిడ్నాప్ చేశారు దుండగులు. దుండుగులు అతడిని రాత్రి వేళ సిటీలో తిప్పి.. అతడిపై దాడి చేసి చార్మినార్ పరిధిలో వదిలేసి వెళ్లిపోయారు. బంగారం వ్యాపారి తనపై దాడి జరిగిందంటూ.. పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు.

దీనికి సంబంధించిన వివరాలను చందానగర్ సీఐ రవీందర్ వివరించారు. చందానగర్ లో ఉండే బంగారం వ్యాపారి లక్ష్మణ్.. చార్మినార్ లో నగలు తయారు చేసే వ్యక్తి దేవిశ్ అగర్వాల్ కు గత డిసెంబర్ లో ఓ ఆర్డర్ ఇచ్చాడు. 3 తులాల బంగారం అడ్వాన్స్ గా ఇచ్చి… 22 తులాల విలువైన బంగారు వడ్డాణం తయారు చేయమన్నాడు. దేవిశ్ అగర్వాల్ అలాగే… తయారు చేసి నగను వ్యాపారికి అందజేశాడు. ఐతే… మిగితా 19 తులాల బంగారాన్ని వ్యాపారి.. తయారుదారు అయిన దేవిశ్ అగర్వాల్ కు సమయానికి అందివ్వకుండా వాయిదాలు వేశాడు.

దీంతో… దేవిశ్ అగర్వాల్ నలుగురు వ్యక్తులతో నిన్న బుధవారం చందానగర్ వెళ్లాడు. వ్యాపారి లక్ష్మణ్ ను తమ వాహనంలో ఎక్కించుకుని.. బంగారం ఇవ్వాలంటూ బెదిరించి….. చార్మినార్ ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. వ్యాపారి భార్య కంప్లయింట్ చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చార్మినార్ లో బంగారు నగలు తయారుచేసే దేవిశ్ అగర్వాల్ మరో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.