గోల్డ్‌కు డిమాండ్‌ తగ్గుతుందా?

గోల్డ్‌కు డిమాండ్‌ తగ్గుతుందా?

రోడ్డు నపడ్డ లక్షల మంది
దయనీయంగా మారిన పరిస్థితులు

న్యూఢిల్లీ: గోల్డ్ డిమాండ్ బాగా పడిపోతోంది. గతేడాది 690 టన్నులుగా ఉన్న గోల్డ్ డిమాండ్… కరోనా కారణంతో ఈ ఏడాది 30 శాతం వరకు తగ్గే
అవకాశం ఉందని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) అంచనావేస్తోంది.. కరోనా అవుట్‌ బ్రేక్‌‌‌‌తో దేశంలో జెమ్స్ అండ్ జ్యువెల్లరీ సెక్టార్
బాగా దెబ్బతింది. దేశవ్యాప్తంగా ఉన్న జ్యువెల్లరీ అండ్ లైఫ్‌స్టయిల్ స్టోర్లు పూర్తిగా మూతపడ్డాయి. ఈ ఇండస్ట్రీ దేశ జీడీపీలో 7 శాతం వరకు సాయం అందిస్తోంది. అంతేకాక 50 లక్షల మందికి పైగా ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇండియన్ జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఇండస్ట్రీ ఎక్కువగా పెళ్ళిళ్లపై ఆధారపడి ఉంటుంది. కానీ కరోనా వైరస్ దెబ్బకు పెళ్ళ్లిలు, పెళ్లిషాపింగ్‌లు, ఈవెంట్లు అన్ని రద్దయ్యా యి. కరోనా కేసులు పెరుగుతుండటంతో రాబోతున్న వెడ్డింగ్ సీజన్ కూడా నడుస్తోందో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధరలు ఎక్కువగా ఉండటంతో ఇండియాలో గోల్డ్ డిమండ్ 2020లో 700–800 టన్నులుగా ఉంటుందని భావించారు. ఇది కరోనా వైరస్ రాకముందు అంచనాలు. కానీ ఈ డిమాండ్‌‌‌‌ను కరోనా ఎఫెక్ట్‌‌‌‌బాగా పడేస్తోంది. గతేడాది నమోదైన 690 టన్నుల నుంచి కూడా కొనుగోళ్లు ఈ ఏడాది 30 శాతంవరకు పడిపోయే అవకాశాలున్నాయని తాజా రిపోర్టులు అంచనావేస్తున్నాయి.

ఇప్పటికే పలు ఇబ్బందుల్లో ఇండస్ట్రీ
వైరస్ దేశీయ ఆర్థిక వ్యవస్థపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపుతోంది. ఎంప్లాయిమెంట్, ఇన్‌‌‌‌కమ్‌పై బాగా దెబ్బకొడుతోంది. జెమ్స్ అండ్ జ్యువెల్లరీ
ఇండస్ట్రీలో పనిచేసే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ ఇండస్ట్రీలో రోజూవారీ పనిచేసే వారు ఎక్కువగా ఉంటారు. వారందరూ
లాక్‌‌‌‌డౌన్ కారణంతో నిరుద్యోగులుగా మారారు. ఇప్పటికే ఈ రంగం అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్, గోల్డ్ మెటల్ లోన్‌‌‌‌పై వడ్డీ చెల్లింపు వంటి పలు సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్‌‌‌‌కు కనీసం 180 రోజులు గడువు పొడిగించాలని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) కోరుతోంది. గోల్డ్ మెటల్ లోన్లను కూడా తక్కువ వడ్డీ రేట్లకు ఆఫర్ చేయాలని అడుగుతోంది. టర్మ్ లోన్లపై ప్రభుత్వం 50 శాతంవరకు వడ్డీ రేట్లు తగ్గించేలా అనుమతి ఇవ్వాలని కూడా కోరింది. వర్కింగ్ క్యాపిటల్ ఫెసిలిటీలు కల్పించాలని అంటోంది.

స్పెషల్ ఫండ్ క్రియేట్ చేయాలి..
ఉద్యోగం లేని క్రాఫ్ట్స్ మెన్స్, ఆర్టిజన్స్ కు వన్‌‌‌‌టైమ్ ఫండింగ్‌‌‌‌ను ఇవ్వాలని, దీని కోసం స్పెషల్ ఫండ్ క్రియేట్ చేయాలని ప్రభుత్వానికి ఐసీసీ రిక్వెస్ట్ పెట్టింది. పెహ్‌చాన్ కార్డుల ద్వారా వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది. ఈ చర్యలు ఇండస్ట్రీకి వెన్నుముకగా ఉన్న వారికి సాయం చేస్తాయని, ఉద్యోగం పోగొట్టుకున్న ఆర్టిజన్స్ ల నిత్యావసరాలకు ఉపయోగపడతాయని చెబుతోంది. ప్రభుత్వం ఇప్పటికే ఈపీఎఫ్ విత్‌డ్రాయల్స్‌‌‌‌లో ఊరట కల్పించిన సంగతి తెలిసిందే. ఈ ఊరటను వచ్చే ఆరు నెలల పాటు కల్పించాలని, దీంతో ఇండస్ట్రీకి లబ్ది చేకూరుతుందని ఐసీసీ అంటోంది. ఉద్యోగుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా ఈ సౌకర్యాన్నిఅన్నికంపెనీలకు కల్పించాలని కోరుతోంది.

For More News..

కరోనాను అడ్డుకోవడంలో వరల్డ్‌ లీడర్‌‌షిప్‌ ఫెయిల్

కరోనా చెత్తను ఎలా పడేయాలో తెలుసా..

టైంపాసుకు రోడ్డెక్కితే.. పట్టేస్తది