హైదరాబాద్, వెలుగు: ఐఎస్‌ఎస్‌ఓ నేషనల్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన యంగ్ ఫెన్సర్ సమీక్ష గారిణే గోల్డ్ మెడల్‌తో మెరిసింది. గుర్గావ్‌లోని అమిటీ గ్లోబల్ స్కూల్‌లో జరిగిన ఈ టోర్నీలో సిటీకి చెందిన పలువురు ఫెన్సర్లు కూడా సత్తా చాటారు.
సమీక్షతో పాటు డెక్కన్ ఫెన్సింగ్ అకాడమీలో కోచ్ సంజీవ్ వద్ద ట్రెయినింగ్ తీసుకుంటున్న ధైవిక్ రెడ్డి, జువ్వాది ఆనికా, జువ్వాది ప్రథమ్, అరిబిండి శృతి తమ తమ విభాగాల్లో సిల్వర్ మెడల్స్ నెగ్గారు.
