
న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు, విదేశీ మార్కెట్లలో అధిక డిమాండ్‌తో బంగారం ధరలు వరుసగా ఆరో రోజు కూడా పెరిగాయి. ఢిల్లీలో సోమవారం 10 గ్రాముల ధర రూ.వెయ్యి పెరిగి రికార్డుస్థాయిలో రూ. 1,05,670కి చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర గత శనివారం 10 గ్రాములకు రూ. 1,04,670కి ఎగిసింది. 9
9.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ. 800 పెరిగి 10 గ్రాములకు రూ. 1,04,800ను తాకింది. ఇది లైఫ్ టైం హై! అంతకుముందు మార్కెట్లో దీని ధర 10 గ్రాములకు రూ. 1,04,000 వద్ద ముగిసింది. వెండి ధరలు సోమవారం కిలోకు రూ. 1,000 పెరిగి రూ. 1,26,000తో సరికొత్త గరిష్ట స్థాయికి చేరాయి. శనివారం కిలో వెండి ధర రికార్డుస్థాయిలో రూ. 6,000 పెరిగి రూ. 1.25 లక్షలకు చేరింది.