హైదరాబాద్ లో భారీగా తగ్గిన బంగారం ధరలు..

హైదరాబాద్ లో భారీగా తగ్గిన బంగారం ధరలు..

హైదరాబాద్‌లో  జూన్​ 28న బంగారం ధరలు  మూడు నెలల కనిష్ట స్థాయికి చేరాయి. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,050, 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,960గా ఉంది. యూఎస్  డాలర్‌లో పెరుగుదల, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు పెంపునకు సంబంధించిన ఊహాగానాలు రావడం బంగారం ధరలలో తగ్గుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఈ సవరణల ఫలితంగా గోల్డ్​ రేట్స్​ మూడు నెలల కనిష్టానికి చేరుకున్నాయి. మే 28న 22 క్యారెట్లకు రూ.54,500,  24 క్యారెట్ల గోల్డ్​ రూ.59,450 గా ఉంది.  డిసెంబర్​తో పోల్చితే మాత్రం ధరలు ఎక్కువగానే ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్​యుద్ధం, ఆర్థిక మాంద్యం తదితర కారణాలు వీటిని ప్రభావితం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో  మరింత తగ్గుతాయా లేదా అనేది చూడాలి.