Gold Prices : బంగారం ధరలకు రెక్కలు.. రూ.59వేల వద్ద ట్రేడింగ్

Gold Prices : బంగారం ధరలకు రెక్కలు.. రూ.59వేల వద్ద ట్రేడింగ్

బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకేలా పరిగెడుతున్నాయి. సామాన్యునికి అందనంత దూరానికి వెళ్లిపోతున్నాయి. గడిచిన 24గంటల్లోనే రూ.450 పెరిగి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,090కు చేరింది. 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర  (22 క్యారెట్లు) రూ. 54,120 కు చేరింది. 

దేశంలోని అతిపెద్ద పట్టణాల్లో సైతం బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.  చెన్నైలో స్వచ్ఛమైన బంగారం (24 క్యారెట్లు) 10 గ్రాముల ధర రూ.52,285 ఉండగా, స్టాండర్డ్ బంగారం (22 క్యారెట్లు) 10 గ్రాములు రూ.47,927 వద్ద ట్రేడవుతోంది. భువనేశ్వర్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,780 కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,800 కు చేరింది.