ఒక్కరోజులోనే భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే.?

ఒక్కరోజులోనే భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే.?

నిన్నటి వరకు  గోల్డ్‌‌‌‌‌‌‌‌ రేటు  ఆల్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ హైని టచ్ చేసింది. ఇండియన్ ఎంసీఎక్స్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో అయితే  10 గ్రాముల గోల్డ్‌‌‌‌‌‌‌‌ రేటు 64,200 దగ్గర ఆల్‌‌‌‌‌‌‌‌ టైమ్ హైని నమోదు చేసింది. అయితే ఇవాళ ఏకంగా వెయ్యి రూపాయలు తగ్గడం విశేషం.

 హైదరాబాద్ బులియన్ మార్కెట్లలో  గోల్డ్ రేటు భారీగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు  రూ. 1090 తగ్గింది. 22  క్యారెట్ల 10  బంగారం ధరపై రూ. 1000 తగ్గింది. అటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ సిల్వర్ రేట్ రూ. 2100 తగ్గి రూ.81,400కు చేరింది. 

హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1090 తగ్గడంతో రూ. 63,110 గా ఉంది.  అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1000 తగ్గడంతో రూ. 57850 కి చేరింది. విశాఖ,విజయవాడలోనూ ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. 

పెళ్లిళ్ల సీజన్ ..గోల్డ్ రేటు పెరిగే చాన్స్ 

పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్‌‌‌‌‌‌‌‌ డిమాండ్ బాగుందని జ్యుయెలర్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది మధ్యలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలు ఇచ్చారు. వడ్డీ రేట్లు తగ్గితే  ఇన్వెస్టర్లకు బాండ్లు, ఎఫ్‌‌‌‌‌‌‌‌డీలు వంటి అసెట్స్‌‌‌‌‌‌‌‌పై తక్కువ రిటర్న్స్ వస్తాయి. ఫలితంగా గోల్డ్‌‌‌‌‌‌‌‌ వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారని కేసీఎం ట్రేడ్ ఎనలిస్ట్‌‌‌‌‌‌‌‌ టిమ్‌‌‌‌‌‌‌‌ వాటెరర్ పేర్కొన్నారు. కాగా, ఫెడ్ చైర్మన్ తాజా స్పీచ్‌‌‌‌‌‌‌‌లో పాలసీని కఠినం చేయమని, అలా అని సులభం కూడా చేయమని అన్నారు. దేశంలో గోల్డ్ ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.పెళ్లిళ్లలో గిఫ్ట్‌‌‌‌‌‌‌‌గా బంగారాన్ని ఇవ్వడం సాధారణమని, ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆప్షన్‌‌‌‌‌‌‌‌గానూ మంచి చాయిస్ అని ఎనలిస్టులు వెల్లడించారు. కానీ, ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే జాగ్రత్త వహించాలన్నారు.