భారీగా పెరిగిన బంగారం ధర..హైదరాబాద్లో ఎంతంటే.?

భారీగా పెరిగిన బంగారం ధర..హైదరాబాద్లో ఎంతంటే.?

దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వారం రోజుల  క్రితం రూ. 60 వేలకు పైగా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల ధర  రూ. 57,300 వరకు పడిపోయిన సంగతి తెలిసిందే.. అయితే మళ్లీ నాలుగైదు రోజులుగా  పెరుగుతోంది.

 హైదరాబాద్ లో  నిన్న  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 54,950  ఉండగా..ఇవాళ(అక్టోబర్ 18) నాటికి రూ.500 పెరిగి రూ.55,450 కు చేరింది. అలాగే   24  క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర నిన్న 59,950 ఉండగా..  రూ. 500 పెరిగి రూ. 60,490కి చేరుకుంది.  దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

Also Read :- 35 లక్షల లగ్గాలకు రూ. 4.25 లక్షల కోట్ల ఖర్చు

 

దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ.55 వేల 600 గా ఉండగా ..  24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ.60 వేల640గా ఉంది.  ఇక ముంబైలో  22 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ. 55 వేల450గా ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ. 60 వేల 490గా ఉంది.  

హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి 22 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ.55వేల 450 గా ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ.60  వేల 190గా ఉంది.  విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ.55 వేల 450గా ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ.60 వేల 490గా ఉంది.