రెండు రోజుల్లో రూ.3వేల 550 తగ్గిన తులం బంగారం.. రేటు ఇంకా పడిపోతుందా?

రెండు రోజుల్లో రూ.3వేల 550 తగ్గిన తులం బంగారం.. రేటు ఇంకా పడిపోతుందా?

ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ రేట్లు పైపైకి పోతున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు పెరిగాయి. దీనివల్ల అమెరికా రానున్న కాలంలో వడ్డీ రేట్లను మరింతగా పెంచొచ్చని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు బాండ్స్ ఈల్డ్స్ కూడా పెరగటంతో బులియన్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు తమ సంపదను బంగారం, వెండి నుంచి అధిక వడ్డీ ఇచ్చే మార్గాల్లోకి తరలిస్తున్నారని వారు అంటున్నారు. అయితే ఈ క్రమంలో తగ్గుతున్న రిటైల్ ధరలను అవకాశంగా మార్చుకుని షాపింగ్ చేద్దాం అనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ నగరాల్లో తగ్గిన రేట్లను పరిశీలించటం బెటర్. అయితే ఈ రేట్ల తగ్గింపు ట్రెండ్ ఇంకా కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిందే..

సెప్టెంబర్ 29న బంగారం రేట్లు తగ్గాయి. సెప్టెంబర్ 28 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు దేశవ్యాప్తంగా రూ.137 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 880గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 640గా కొనసాగుతోంది. 

మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 29, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 45వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.