హైదరాబాద్ లో బంగారం ధర ఎంతంటే.?

హైదరాబాద్ లో బంగారం ధర ఎంతంటే.?

గత రెండు రోజుల క్రితం బంగారం ధర 60 వేలకు పైగా ఉంది.  సెప్టెంబర్ 9న 60 వేలకు పైన ఉన్న బంగారం ధర  సెప్టెంబర్ 10న 60 వేలకు కిందకు దిగి వచ్చింది.   ఇవాళ సెప్టెంబర్ 11  వ  తేదీన 24 క్యారెట్ల  బంగారం ధరపై మరో రూ.10 తగ్గింది.  ఈ రోజు అంటే సోమవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 59,830,  22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 54,840 గా ఉంది. 

ALSO READ :హైదరాబాద్‌లో మరో కంట్రీ చికెన్​ ఔట్​లెట్​

ఇక వెండి ధర ఈ రోజు అంటే సోమవారం కూడా స్థిరంగా ఉంది. ఆదివారం వెండి కిలో రూ.77000 ఉండగా..  సోమవారం కూడా వెండి ధర అలాగే ఉంటుంది. ఏపీలోని  విజయవాడలో కూడా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,850 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59830గా ఉంది. 

 న్యూ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర54990 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59990గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54840 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59830 గా ఉంది