Gold Rate: ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి గోల్డ్, సిల్వర్.. బ్రేకులు లేకుండా ర్యాలీ.. అందువల్లే..!

Gold Rate: ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి గోల్డ్, సిల్వర్..  బ్రేకులు లేకుండా ర్యాలీ.. అందువల్లే..!

Gold Price Today: దేశవ్యాప్తంగా దీపావళికి ముందు బంగారం, వెండి రేట్లు కలలో కూడా భారతీయులు ఊహించని స్థాయిలకు పెరిగాయి. ప్రధానంగా అమెరికా షట్ డౌన్ తర్వాత ఊపందుకున్న రేట్ల ర్యాలీకి ప్రస్తుతం ఫ్రెంచ్ రాజకీయ అనిశ్చితి కూడా తోడవటంతో ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ ప్రపంచ స్థాయిలో కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు అమెరికా డాలర్, సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు వంటి మరిన్ని చర్యలు సేఫ్ హెవెన్ డిమాండ్ పెంచుతున్నట్లు తేలింది. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే అక్టోబర్ 6తో పోల్చితే 10 గ్రాములకు అక్టోబర్ 7న రూ.1250 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.125 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 7న):

హైదరాదాబాదులో రూ.12వేల 202
కరీంనగర్ లో రూ.12వేల 202
ఖమ్మంలో రూ.12వేల 202
నిజామాబాద్ లో రూ.12వేల 202
విజయవాడలో రూ.12వేల 202
కడపలో రూ.12వేల 202
విశాఖలో రూ.12వేల 202
నెల్లూరు రూ.12వేల 202
తిరుపతిలో రూ.12వేల 202

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు అక్టోబర్ 5తో పోల్చితే ఇవాళ అంటే అక్టోబర్ 7న 10 గ్రాములకు రూ.1150 పెరుగుదలను చూసింది. దీంతో మంగళరం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

ALSO READ : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 7న):

హైదరాదాబాదులో రూ.11వేల 185
కరీంనగర్ లో రూ.11వేల 185
ఖమ్మంలో రూ.11వేల 185
నిజామాబాద్ లో రూ.11వేల 185
విజయవాడలో రూ.11వేల 185
కడపలో రూ.11వేల 185
విశాఖలో రూ.11వేల 185
నెల్లూరు రూ.11వేల 185
తిరుపతిలో రూ.11వేల 185

మరోపక్క వెండి తమ ర్యాలీని కొనసాగించటం ఆపటం లేదు. అక్టోబర్ 7న కేజీకి వెండి అక్టోబర్ 6తో పోల్చితే రూ.వేయ్యి పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి వెయ్యి రూపాయలు పెరిగి రూ.లక్ష 67వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.167 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.