దొంగల ముఠా అరెస్ట్.. ఐదుగురు నిందితుల్లో ముగ్గురు మహిళలు

దొంగల ముఠా అరెస్ట్.. ఐదుగురు నిందితుల్లో ముగ్గురు మహిళలు
  • బంగారు, వెండి ఆభరణాలు, ఆటో, బైక్ సీజ్  
  • మీడియా సమావేశంలో    నర్సంపేట ఏసీపీ రవీందర్​రెడ్డి  

నర్సంపేట, వెలుగు : వరుస చోరీల ముఠాను మహబూబాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద బంగారు, వెండి ఆభరణాలు, నగదును సీజ్ చేశారు. నర్సంపేట ఏసీపీ రవీందర్​రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్​కు చెందిన మహ్మద్​ఇమ్రాన్, మాదాసు నవీన్, మాదాసు భార్గవి దంపతులు, కొత్తగూడెం జిల్లా కొండైగూడెంకు చెందిన భార్గవి చెల్లెళ్లు కుంజా విజయ, బత్తుల రాజేశ్వరి ముఠాగా ఏర్పడ్డారు. 

కొన్నాళ్లుగా తాళాలు వేసిన ఇండ్లలో చోరీలు చేస్తూ బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్తున్నారు. నర్సంపేట, ఖానాపురం, మహబూబాబాద్​ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. ఐదుగురు నిందితుల వద్ద 2.2 తులాల బంగారం, 38 తులాల వెండి, ఐదు సెల్ ఫోన్లు, ఆటో, బైక్​స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.  ప్రెస్ మీట్ లో ఎస్ఐలు రవికుమార్, అరుణ్​కుమార్, హెడ్​కానిస్టేబుల్​మహ్మద్​ఖాజం అలీ, నాగరాజు ఉన్నారు.