Gold Special : ఒక్కో నైజాం నగ.. ఒక్కో వెరైటీ.. బంగారం బెల్ట్.. రంగుల అందె.. జాకోబ్ డైమండ్..

Gold Special : ఒక్కో నైజాం నగ.. ఒక్కో వెరైటీ.. బంగారం బెల్ట్.. రంగుల అందె.. జాకోబ్ డైమండ్..

సంస్థానాల వైభవాన్ని చాటే సూచికలు ఆభరణాలే. ఆభరణాలు ధరించడంలో తమదైన ప్రత్యేకతను కొనసాగించే రాజవంశాలు, తయారీలోనూ అలాంటి ప్రత్యేకమైన ముద్రనే వేశాయి. నిజాంల ముద్ర, దక్కన్ స్వర్ణకారుల ప్రతిభకు మచ్చుతునకలైన ఈ ఆభరణాలు నైజాం నగలే. నిజాం ఆస్తులైన నైజాం సంపద, సృజన ఇది. భారత ప్రభుత్వ పరమైన నిజాం నగలు చాలా కాలం తర్వాత మళ్లీ ప్రదర్శనకు వచ్చాయి. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఇప్పుడు వీటిని ప్రదర్శిస్తున్నారు.


నిజాం నగలకు  ప్రపంచంలోని అత్యధిక వెలరీ కలెక్షన్ పేరుంది. ఆకర్షణీయ మైన ఆభరణాలను ధరించడానికి ఇష్టపడే నిజాం రాజు తమ హోదాను చాటు కోవడానికి అనేక ప్రయోగాలు చేశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వ్యాపారుల నుంచి పెద్ద వజ్రాలు, అరుదైన బర్మాకెంపులు, కొలంబియా పచ్చలు పొదిగిన మేలిమి బంగారు ఆభరణాలను తయారు చేయిం చుకున్నారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్, ఆయన వారసుడు ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఆభరణాలు, సేకరించిన ఆభరణాలు నిజాం ట్రస్ట్ పరిరక్షణలో ఉన్నాయి. భారత ప్రభుత్వం ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో ఇవి జాతీయ సంపదగా గుర్తింపు పొందాయి. 

నిజాం కలెక్షన్లో ఆభరణాలతో పాటు ఆయుధాలు, ఉపకరణాలు కలిపి మొత్తం 210 విలువైన కళాఖండాలున్నాయి. వీటిలో 173 ఆభర ణాలు.. కిరీటాలు, శిరోభూషణాలు, హారాలు, వడ్డాణాలు, కడియాలు, అందెలు, బెల్టులు, వాచీలు, కమ్మలు, ముక్కుపుడకలు మొదలైన ఆభరణాలను నిజాంలు సేకరించారు. టైమ్స్ మ్యాగజైన్ లెక్కల ప్రకారం ప్రపం చంలోనే అత్యంత సంపన్నుడిగా గుర్తింపు పొందిన ఏడో నిజాం సేకరించిన ఆభరణాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆభరణా లలో స్థానికంగా తయారు చేసినవే కాకుండా. ఇరాన్, ఈజిప్ట్, ఇటలీ, బర్మా, అమెరికా మొదలైన దేశాలలో తయారు చేసిన ఆభరణాలున్నాయి. 

225 సంవత్సరాల కాలంలో నిజాం రాజవంశం సేకరించిన ఆభరణాల న్నింటినీ భారత ప్రభుత్వం 1995లో 218 కోట్ల రూపాయలకు వీటిని కొనుగోలు చేసింది. ఇప్పుడు వీటి ధర కొన్ని వేల కోట్లు! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజాం నగల్ని హైదరాబాద్ కు తీసుకురావాలని ప్రయ త్నించింది. 2001, 2005లో సాలర్ జంగ్ మ్యూజియంలో నిజాం ఆభరణాలను ప్రద ర్శించారు. కానీ వీటి ప్రదర్శనకు ఒక శాశ్వ తమైన వేదిక లేదు. ఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్ లాకర్లలో నిజాం ఆభరణాలను భద్రపరిచారు.   జ్యూవెల్స్ ఆఫ్ ఇండియా.. దినిజామ్స్ కలెక్షన్" పేరుతో నేషనల్ మ్యూజియం ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తోంది. ఈ నగలను హైదరా బాద్లో శాశ్వత ప్రదర్శనకు ఉంచాలని ఏదో నిజాం వారసుడు, నిజామ్స్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నజాప్ అలీఖాన్ కోరుతున్నారు. అందుకోసం కృషి చేసి మన వారసత్వాన్ని వెనక్కు తీసుకురావాలని ఆయన కోరుతున్నారు.

రంగుల అందె

కాలి అందెను ఇంత గొప్పగా తయారు చేయించుకుంటారా? అనుకోకండి. భూలోక సంపన్నుడైన నిజాం పట్టింది. బంగారం. ఆ కుటుంబంలో అందరూ వజ్రాభరణాలే ధరిస్తారు! ఈ పొద భూషణాలకు కూడా వజ్రాలు పొదిగారు, బంగారంతో తయారు చేసిన ఈ అందెలో గోల్కొండ వజ్రాలు, బర్వీస్ కెంపులు, కొలంబియా పచ్చలు పొదిగి ఉన్నాయి. చుట్టుకొలత: 10.5 సెం.మీ. బరువు 790 గ్రా.


జాకోబ్ డైమండ్

457.5 క్యారెట్ల ఈ వజ్రాన్ని, కోసి, పాలిష్ చేసిన తర్వాత 184.5 క్యారెట్లకు చేరింది. ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల్లో ఇది ఏడవది, జాకబ్ ఈ డైమండు తన పాదరక్షకు అలంకరించుకునే వాడు. అందుకే దీనికి జకట్ డైమండ్ అని పేరు వచ్చింది. అలెగ్జాండర్ జాకబ్ అనే వ్యాపారి నుంచి ఈ డైమంద్ని ఆరో . నిజాం మహబూబ్ అలీఖాన్ కొన్నాడు. ఆయన జాకబ్ డైమండ్ని పేపర్ వెయిట్ వాడాడు.

బంగారంతో బెల్ట్

ఏడో నిజాం ఆభరణాల్లోనే కాదు.. సౌకర్యం కోసం ఉపయోగించేది ఏదైనా ఖరీదైనదే కావాలని కోరుకునేవాడు. అందుకు ఈ బెల్టే ఉదాహరణ. బెల్టుని గట్టిగా పట్టి ఉంచే బకెల్ని బంగారంతో తయారు చేయించుకున్నాడు. దీనిని వజ్రాలతో అలంకరించి తన విలాసాన్ని ఇలా చాటుకున్నాడు. స్వర్ణకారులు ఈ బకెట్ లోని మూడు భాగాలనూ కుందన్ శైలిలో తయారు చేసిన బంగారు తీగల మధ్య వజ్రాలను పూవుల్లా పొదిగారు. దక్కన్ కళాకారుల ప్రతిభకు ఇదో మచ్చుతునక.
పొడవు: 17 సెం.మీ. బరువు 252 గ్రాములు

ఇస్కందరియా

ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ బహదూర్ విలాస ప్రియుడు. ఆయన యోర్ అండ్ జువెలరీ కంపెనీ నుంచి ఇస్కందియా అనే ఉంగరాన్ని కొనుగోలు చేసిండు. విలువైన వజ్రాలు పొదిగిన ఈ ఉంగరంలో ఆ కంపెనీ పేరు కూడా కనిపిస్తుంది.

జమరుద్

వజ్రాలు పొదిగిన బంగారు శిరోభూషణం ఇది. ఆకర్షణీయంగా ఉన్న పచ్చలు దీని ప్రత్యేకత. భారతీయ హస్తకళా కళాకారులు యూరోపియన్ శైలిని సమ్మిళితం చేసి ఈ శిరోభూషణం తయారు చేశారు. కొలంబియా పచ్చలు ఇందులో పొదిగారు. బ్రిటీష్ రాణిపట్ల తన విధేయతను చాటుకునేందుకు ఏడో నిజాం ఆభరణాలను బహుకరించాలనుకున్నాడు. భారతీయ సంస్థానాధీశులు ధరించే శిరోభూషణం (సరపెచ్)ని బ్రిటన్ రాణికి బహుకరించాలనుకున్నాడు, ఇరాన్ ఆభరణాల వ్యాపారి నుంచి జమ్రుద్' అనే ఈ ఆభరణాన్ని, వజ్రాల నెక్లెస్ని కొనుగోలు చేశాడు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో దానిని ఎలిజబెత్ రాణికి బహుకరించలేదు.