మళ్లీ భగ్గుమన్న బంగారం ..10 గ్రాముల ధర రూ. 2,400 జంప్​ 

మళ్లీ భగ్గుమన్న బంగారం ..10 గ్రాముల ధర రూ. 2,400 జంప్​ 

న్యూఢిల్లీ: నగల వ్యాపారులు భారీగా కొనడంతో మంగళవారం దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ. 2,400 పెరిగి రూ. 99,750కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.  99.9 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి 10 గ్రాములకు సోమవారంరూ. 97,350 వద్ద ముగిసింది.  99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం మంగళవారం 10 గ్రాములకు రూ.2,400 పెరిగి రూ.99,300కి చేరుకుంది. గత ముగింపులో ఇది 10 గ్రాములకు రూ.96,900 వద్ద ముగిసింది. 

వెండి ధరలు కూడా కిలోకు రూ. 1,800 పెరిగి రూ. 98,500కి చేరుకున్నాయి.  గ్లోబల్​ మార్కెట్లలో స్పాట్ గోల్డ్​ధర ఔన్సుకు (28.3 గ్రాములు) 45.65 డాలర్లు పెరిగి 3,379.77 డాలర్లకు చేరుకుంది. "రష్యా–-ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ఈస్ట్​లో కొనసాగుతున్న ఘర్షణలు,  భారతదేశం– పాకిస్తాన్ మధ్య తాజా ఉద్రిక్తతల వల్ల వరుసగా రెండవ రోజు కూడా బంగారం, వెండికి డిమాండ్​ పెరిగింది. గ్లోబల్​ మార్కెట్లలో మంగళవారం బంగారం ధర మళ్లీ 3,350 డాలర్ల స్థాయికి వచ్చింది.