
హైదరాబాద్, వెలుగు: ఫ్లీట్ మేనేజ్‌మెంట్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు గోల్డ్‌స్టోన్ టెక్నాలజీస్ (జీటీఎల్), జర్మనీ కంపెనీ క్వాంట్రన్ ఏజీలు చేతులు కలిపాయి. జీటీఎల్– క్వాంట్రన్ జాయింట్ వెంచర్ కంపెనీ ఇందు కోసం ఓ ప్లాట్‌ఫామ్‌ను డెవలప్ చేసింది. ఏఐ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. వెహికల్ తయారీ కంపెనీలకు మొబిలిటీ యాజ్ ఏ సర్వీస్ (మాస్)లను ఆఫర్ చేస్తుంది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఎక్కడ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి వంటి డేటాను ఈ ప్లాట్‌ఫామ్ ఇస్తుంది. జియోఫెన్సింగ్, ట్రిప్స్‌కు సంబంధించిన ఇన్‌ఫర్మేషన్, కార్బన్ క్రెడిట్స్‌ను ట్రాక్ చేయడం, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, స్మార్ట్ నావిగేటర్ వంటి ఫీచర్లు ఈ ప్లాట్‌ఫామ్‌లో ఉంటాయి.
హైడ్రోజన్ , ఎలక్ట్రిక్ బండ్లకు ఈ కంపెనీల జాయింట్ వెంచర్ సర్వీస్‌లను అందించనుంది. జీటీఎల్ సాఫ్ట్‌వేర్, ఓవర్‌సీస్ ప్లాట్‌ఫామ్ ఇంటిగ్నేషన్ వంటి సర్వీస్‌లను అందించనుండగా, క్వాంట్రన్ ఈ జాయింట్ వెంచర్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను తన నెట్‌వర్క్‌లో వాడుతుంది. దేశంలో ఫ్లీట్ మేనేజ్‌మెంట్ మార్కెట్ 2032 నాటికి రూ.5.8 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ మార్కెట్‌లోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి జీటీఎల్‌తో పార్టనర్‌షిప్ కుదుర్చుకున్నామని క్వాంట్రాన్ ఏజీ పేర్కొంది.