
- గుర్రప్పందాలు, గ్యాంబ్లింగ్ నుంచి వేరు చేసిన జీఓఎం
వెలుగు బిజినెస్ డెస్క్: గుర్రప్పందాలు, గ్యాంబ్లింగ్ల తరహాలో కాకుండా వేరుగా ఆన్లైన్ గేమింగ్‌పై ట్యాక్స్ వేయాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) నిర్ణయించింది. జీఓఎం నిర్ణయంపై ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేసింది. ఆన్లైన్ గేమ్స్‌పై పన్నును 18 శాతం నుంచి 28 శాతానికి పెంచాలని జీఎస్టీ కౌన్సిల్ ఈ ఏడాది జులైలో ప్రతిపాదించింది. ప్రస్తుతం గ్రాస్ గేమింగ్ రెవెన్యూపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అయితే గ్రాస్ గేమింగ్ వాల్యూపై ట్యాక్స్ వేయాలనేది జీఓఎం ప్రపోజల్. అంటే, ప్లేయర్లు స్టేక్‌గా పెట్టే మొత్తం మీద ట్యాక్స్ విధిస్తారు. ఇందు వల్ల రెవెన్యూ ఎక్కువగా కనబడుతుంది.ఆన్లైన్ గేమింగ్‌లో ప్లేయర్లందరూ కలిసి ప్రైజ్ మనీ పూల్ క్రియేట్ చేస్తారు.
ఆ తర్వాత గెలుపొందిన వాళ్లకి ఈ పూల్ నుంచి చెల్లిస్తారు. పూల్ మొత్తానికి గెలుపొందిన వాళ్లకి చెల్లించే మొత్తానికి మధ్య వ్యత్యాసాన్నే గ్రాస్ గేమింగ్ రెవెన్యూ అంటారు. గ్రాస్ గేమింగ్ వాల్యూపై 28 శాతం పన్ను విధించడమంటే ఇప్పుడున్న దానికంటే రెట్టింపవుతుందనే ఆందోళనను ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ వ్యక్తం చేసింది. అలా చేస్తే చాలా కంపెనీలు మూతపడతాయని కూడా ఇండస్ట్రీ పేర్కొంది.
5 బిలియన్ డాలర్లకు
చేరనున్న ఆన్లైన్ గేమింగ్....
మన దేశంలో ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ 2025 నాటికి 5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. బీసీజీ, సెకోవియా ఇండియాలు తమ రిపోర్టులో ఈ అంచనా వేశాయి. డ్రీమ్ స్పోర్ట్స్, మొబైల్ ప్రీమియర్ లీగ్ వంటి యూనికార్న్ కంపెనీలు ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాయి. కానీ, ఈ ఇండస్ట్రీ ఇంకా ఎదిగే దశలోనే ఉందని చెప్పుకోవచ్చు.
హర్షం ప్రకటిస్తున్న ఇండస్ట్రీ...
ఆన్లైన్ గేమింగ్‌ను వేరుగా చూడాలనే నిర్ణయానికి జీఓఎం రావడం సంతోషకరమని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోలాండ్ ల్యాండర్స్ చెప్పారు. ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ స్థితిగతులను పరిశీలించి, సరయిన పన్ను రేటును నిర్ణయిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గుర్రప్పందాలు, గ్యాంబ్లింగ్ల నుంచి వేరుగా చూడాలనే జీఓఎం నిర్ణయం సరైనదని గేమింగ్ మార్కెటింగ్ కంపెనీ ఫౌండర్ రోహిత్ అగర్వాల్ పేర్కొన్నారు.
ఆయా రంగాల పరిస్థితులు ఒకేలాంటివి కాదని వివరించారు. ఆపరేటింగ్ ప్రొసీజర్లు, ప్రాఫిట్ మార్జిన్లు కూడా ఒకేలా ఉండవని చెప్పారు. ప్రమాణాల ప్రకారం ట్యాక్స్ విధించడమే సమంజసమని అన్నారు. మూడు రంగాలపైనా 28 శాతం జీఎస్టీ వేయాలని జీఓఎం గతంలో రికమెండ్ చేసింది. దీనిపై ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ తీవ్ర అభ్యంతరం ప్రకటించింది. ఫ్యాంటసీ స్పోర్ట్స్, రమ్మీ వంటి వాటిని స్కిల్ గేమ్స్‌గా గుర్తిస్తూ కోర్టులు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ఇండస్ట్రీ ప్రస్తావించింది.
త్వరలో జీఓఎం ఫైనల్ రిపోర్టు
గుర్రప్పందాలు, గ్యాంబ్లింగ్, ఆన్లైన్ గేమింగ్‌పై ట్యాక్స్ పెంచాలనే జీఎస్టీ కౌన్సిల్ ప్రపోజల్‌ను పరిశీలించడానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) ఏర్పాటు చేశారు. ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ ప్రతినిధులతో చర్చలు జరపాలని, ఆ తర్వాతే జీఎస్టీ రేట్లను ఖరారు చేయాలని ఈ నెల 5 న జరిగిన మీటింగ్‌లో జీఓఎం డిసైడ్ చేసింది. అంతేకాదు, ఫైనల్ రిపోర్టు ఇచ్చే ముందు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలని నిర్ణయించింది. గుర్రప్పందాలు, గ్యాంబ్లింగ్లతో ఆన్లైన్ గేమింగ్‌ను కలిపి చూడకూడదనే నిర్ణయానికి కూడా జీఓఎం వచ్చింది.