రేపటి నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు

రేపటి నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్‌: రేపటి నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీస్‌లు నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణలో కరోనా లాక్‌డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడంతో అంతర్రాష్ట్ర బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు నడపనున్నారు.

రేపటి నుంచి తెలంగాణకు బస్సులు నడపనున్న ఏపీఎస్‌ఆర్టీసీ
రేపటి నుంచి తెలంగాణకు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు నడపనుంది. ఉదయం 6 నుంచి సా.6 గంటల వరకు బస్సులు నడపాలని నిర్ణయించింది. ఏపీఎస్‌ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం కల్పించింది.