వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. త్వరలోనే వీడియో కాలింగ్, ఇమోజీల్లో అవతార్ ఫీచర్ తీసుకురానుంది వాట్సాప్. ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది ఈ ఫీచర్. ఇప్పుడు వాట్సాప్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్టు ‘డబ్ల్యూ బీటా ఇన్ఫో’ చెప్పింది. ఫ్రంట్ కెమెరాతో ఫొటో క్లిక్ చేసి, అవతార్ క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు అవతార్‌కి స్విచ్ అవ్వొచ్చు. ఈ ఫీచర్ వస్తే... యానిమేటెడ్ అవతార్ ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఫన్ చాటింగ్ చేయొచ్చు.