మీ పాస్ వార్డు భద్రంగా ఉందా..? : గూగుల్ క్రోమ్‌లో కొత్త ప్రైవసీ టూల్

మీ పాస్ వార్డు భద్రంగా ఉందా..? : గూగుల్ క్రోమ్‌లో కొత్త ప్రైవసీ టూల్

మీరు గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. గూగుల్ సంస్థ తాజాగా మీ ఆన్‌లైన్ ప్రైవసీని యాక్టివ్ గా ఉంచే ఓ ఆటోమేటిక్ సేఫ్టీ చెక్ ఫీచర్‌ను పరిచయం చేసింది. మీరు సైట్ ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీ భద్రతను నిర్ధారించడానికి ఈ ఫీచర్ మిమ్మల్ని అలర్ట్ గా ఉంచుతుంది. గూగుల్ క్రోమ్ (Google Chrome) అప్‌డేట్ ప్రకారం..  క్రోమ్ లో మీరు సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు ఏవైనా ఉంటే ఈ ప్రైవసీ చెకింగ్ ఫీచర్ ఇప్పుడు ముందుగానే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. మీ ఆన్‌లైన్ ఖాతాలను కూడా సేఫ్ గా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. 

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. కోట్లాదిమంది యూజర్లు దీనిని వాడుతున్నారు. వారందరికీ మెరుగైన ఆన్‌లైన్ సెక్యూరిటీ, ప్రైవసీ అందించేందుకు గూగుల్ క్రోమ్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. తాజాగా ఆన్‌లైన్ సెక్యూరిటీని రక్షించడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా రన్ అయ్యే “సేఫ్టీ చెక్ (Safety check)” అనే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది.

* క్రోమ్‌లో సేవ్ చేసిన ఏవైనా పాస్‌వర్డ్‌లు లీక్ అయ్యాయా..? లేదా..? హ్యాకర్లు తస్కరించారా అనే వివరాలను ఇది చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ వివరాలు లీకైనా.. లేదంటే ఎవరైనా కొట్టేసినా.. ఈ ఫీచర్ వెంటనే మిముల్నీ అలర్ట్ చేస్తుంది. అప్పుడు పాత పాస్‌వర్డ్‌లు చేంజ్ చేసుకుని ప్రమాదం పెద్దదవ్వకుండా జాగ్రత్త పడవచ్చు.

* సేఫ్టీ చెక్ ఫీచర్ క్రోమ్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఏవైనా ఎక్స్‌టెన్షన్స్ హానికరమైనవా.. ? కాదా..? అని కూడా చెక్ చేస్తుంది. అవి హానికరమైతే యూజర్లను హెచ్చరిస్తుంది. దీంతో వాటిని అన్‌ఇన్‌స్టాల్ లేదా డిలీట్ చేసుకోవచ్చు.

* మోస్ట్ అప్ టు డేట్ సెక్యూరిటీ ప్యాచ్‌లను కలిగి ఉన్న క్రోమ్ లేటెస్ట్ వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారా..? లేదా..? అనేది కూడా ఇది చెక్ చేస్తుంది. లేకపోతే బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయమని అడుగుతుంది.

* లొకేషన్, మైక్రోఫోన్, కెమెరా లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ఏవైనా వెబ్‌సైట్లకు పర్మిషన్స్ ఇచ్చారో లేదో ఇది చెక్ చేస్తుంది. యూజర్ చాలా కాలం పాటు ఆ వెబ్‌సైట్లను విజిట్ చేయకపోతే, ఆ పర్మిషన్స్ తీసేయమని సూచన చేస్తుంది.

* క్రోమ్‌లోని త్రీ-డాట్స్ మెనూ నుంచి “సేఫ్టీ చెక్” ఫీచర్‌ను చాలా ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. అది ముందుగానే హెచ్చరించే వాటిపై సకాలంలో యాక్షన్ తీసుకొని ఏ ప్రమాదం జరగకముందే జాగ్రత్త పడొచ్చు.

* గూగుల్ క్రోమ్ జోడించిన కొత్త ఫీచర్ సేఫ్టీ చెక్ మాత్రమే కాదు. డెస్క్‌టాప్‌లో “మెమరీ సేవర్” మోడ్‌ను కూడా మెరుగుపరిచింది. క్రోమ్ ఫాస్ట్, స్మూత్‌గా రన్ రావడానికి మెమరీ సేవర్ కీలక పాత్ర పోషిస్తుంది. మెమరీ సేవర్ మోడ్ రెండు పనులను చేస్తుంది. ఇది ప్రతి ట్యాబ్ ఎంత మెమరీని ఉపయోగిస్తుందో చూపిస్తుంది, ఎక్కువగా వినియోగించే వాటిని క్లోజ్ చేయడానికి సులభతరం చేస్తుంది. దీనితో కొన్ని వెబ్‌సైట్లను “ఆల్వేస్ యాక్టివ్‌"గా మార్క్ కూడా చేసుకోవచ్చు. దీంతో చాలా ట్యాబ్‌లు ఓపెన్ చేసినప్పుడు అవి తాత్కాలికంగా క్లోజ్ లేదా ఇగ్నోర్ అవ్వవు.

మెమరీ సేవర్ మోడ్‌తో మెరుగైన పనితీరు  

భద్రతపై మాత్రమే కాకుండా యూజర్ ఎక్స్ పీరియన్స్ ను మెరుగుపరచడంపై కూడా Google దృష్టి సారిస్తోంది. డెస్క్‌టాప్‌లోని Chromeను మరింత సాఫీగా అమలు చేయడానికి మెమరీ సేవర్ మోడ్ ను తీసుకువచ్చింది. ఇది ట్యాబ్ మెమరీ వినియోగం గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. వెబ్‌సైట్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేందుకు Always Remain Active   తో యూజర్స్ కు తెలియజేస్తుంది.

మెమరీ సేవర్ మోడ్‌ని ఎలా యాక్టివేట్ చేయాలంటే..

* Google Chrome సెట్టింగ్‌లకు వెళ్లండి
* Performance section ఆప్షన్ ను ఎంచుకోండి
* మెమరీ సేవర్‌పై క్లిక్ చేయండి.
* ఇది మరింత సమర్థవంతమైన బ్రౌజింగ్ అనుభవాన్ని నిర్ధారిస్తుంది.