పాత విండోస్ కంప్యూటర్లలో క్రోమ్ బంద్!

పాత విండోస్ కంప్యూటర్లలో క్రోమ్ బంద్!

వచ్చే ఏడాది నుంచి పాత వెర్షన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ (విండోస్7, విండోస్  8.1) వాడుతున్న కంప్యూటర్స్ లో గూగుల్ క్రోమ్ ఇక పని చేయదు. సెక్యూరిటీ ఫీచర్లు, డేటా ప్రైవసీ,  కొత్త ఫీచర్లు, బెటర్ యూజర్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది గూగుల్.

లేటెస్ట్ వెర్షన్లు వచ్చినా.. ఇప్పటికీ చాలామంది పాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నే వాడుతున్నారు. సాధారణంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ చాలా టెక్ కంపెనీలు పాతతరం డివైజ్ లకు వాళ్ల సేవలు ఆపేస్తుంటాయి. ఇప్పుడు గూగుల్ కూడా వాటి బాటలోనే నడుస్తోంది. గూగుల్ తెస్తున్న లేటెస్ట్ క్రోమ్ వెర్షన్ 110, విండోస్ 10 ఆపై వెర్షన్లకు మాత్రమే పనిచేస్తుంది. విండోస్ 7, విండోస్ 8.1 వెర్షన్లు వాడుతున్న వాళ్లు తొందరగా కొత్త వెర్షన్ కి అప్ గ్రేడ్ కావాలని, లేదంటే 2023 ఫిబ్రవరి 7న విడుదల చేసే గూగుల్ క్రోమ్ 110 అప్ డేట్ తో పాత విండోస్ సాఫ్టవేర్లు వాడేవాళ్లు క్రోమ్ సేవలు వినియోగించుకోలేరని తెలిపింది గూగుల్. దీనివల్ల యూజర్లు సైబర్ అటాక్, ఫ్రాడ్, మాల్ వేర్, వైరస్ అటాక్ ల బారిన పడకుండా ఉంటారు. ఈ అప్ డేట్ సెక్యూరిటీ పరంగా బాగానే ఉన్నా, కొత్త కంప్యూటర్లు కొనలేని వాళ్లకు ఇది భారంగా మారే అవకాశం ఉంది.