ఇన్ యాక్టివ్​ అకౌంట్లను తొలగిస్తున్న గూగుల్​.. ఎందుకంటే?

ఇన్ యాక్టివ్​ అకౌంట్లను తొలగిస్తున్న గూగుల్​.. ఎందుకంటే?

రెండు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం ఇన్​యాక్టివ్​గా ఉన్న యూజర్​ ఖాతాలను తొలగిస్తామని గూగుల్​ ప్రకటించింది. జీమెయిల్​, డాక్స్​, డ్రైవ్​, మీట్, క్యాలెండర్, యూట్యూబ్​, గూగుల్​ ఫొటోలు లాగిన్​ అయి ఉన్న అకౌంట్​లను ఈ ఏడాది డిసెంబర్​ నాటికి తొలగించనున్నట్లు చెప్పింది. గూగుల్​లో భద్రతా చర్యలను పెంచడానికి, వినియోగదారులకు వేరే అకౌంట్లతో పొంచి ఉన్న ప్రమాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఇందులో వ్యాపారాలు చేసే వారికి, పాఠశాలల వ్యక్తిగత అకౌంట్లకు మినహాయింపు ఉండనున్నట్లు వెల్లడించింది. వినియోగదారులు తమ అకౌంట్లను సరిగ్గా ఉంచుకోవడానికి అనుసరించాల్సిన చర్యల జాబితాను కూడా గూగుల్​ అందించింది. 

ఎందుకు తొలగిస్తోంది...

ఇన్​యాక్టివ్​గా ఉన్న ఖాతాలను తొలగించే నిర్ణయం వెనక పెద్ద కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్​యాక్టివ్​ ఖాతాలు ఇతరులకు ప్రమాదకరంగా మారవచ్చు. అది స్పామ్​గా మారి, సైబర్​ నేరస్థులకూ ఉపయోగపడవచ్చని గూగుల్​ భావిస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ తొలగింపు కేవలం వ్యక్తిగత అకౌంట్లకే వర్తిస్తుంది. అకౌంట్​లు తొలగించేటప్పుడు గూగుల్​ నుంచి నోటిఫికేషన్​లు వస్తాయి. దాంతో మన అకౌంట్​ను తొలగించారని అనుకోవచ్చు.