పాస్​వర్డ్ కాదు.. పాస్​ కీ

పాస్​వర్డ్ కాదు.. పాస్​ కీ

వరల్డ్ పాస్​వర్డ్ డే’ సందర్భంగా యూజర్లకు గూగుల్ కొత్త ఫీచర్ పరిచయం చేసింది. ఎప్పుడూ తమ ఆన్​లైన్​ అకౌంట్​ల పాస్​వర్డ్​లు మర్చిపోయే యూజర్ల కోసం ఇది ఉపయోగపడుతుందట. దీంతో యూజర్లు అకౌంట్ పాస్​ వర్డ్, టూ– స్టెప్ వెరిఫికేషన్ అవసరం లేకుండా ఫింగర్ ప్రింట్​, ఫేస్ స్కాన్​ లేదా స్క్రీన్ లాక్​ పిన్ సాయంతో లాగిన్ చేయొచ్చు. 

గూగుల్ యూజర్లు ఈ ఫీచర్​ని ముందుగానే ఎనేబుల్ చేయాలి. ఇందుకోసం అకౌంట్​ ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేయాలి. అందులో మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్​ మీద క్లిక్ చేస్తే, సెక్యూరిటీ సెక్షన్​ కనిపిస్తుంది. ఆ సెక్షన్​కి వెళ్లి పాస్ కీస్​ (Passkeys) అనే ఆప్షన్​ని ఎనేబుల్ చేయాలి. దాంతో యూజర్ అకౌంట్​కి పాస్​కీస్​ ఫీచర్ యాక్టివేట్ అయినట్లు మెసేజ్ వస్తుంది. మొబైల్​లో ఈ ఫీచర్​ని ఎనేబుల్ చేస్తే, ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ స్కాన్​ ఆప్షన్లతో పాస్​కీ ఆటోమెటిక్​గా క్రియేట్ అవుతుంది. లేదంటే క్రియేట్ పాస్​కీ ఆప్షన్​తో యూజర్ కొత్త కీని క్రియేట్ చేయొచ్చు. 

సిస్టమ్​లో చేయాలంటే, కీబోర్డ్​లో ఫింగర్ ప్రింట్​ స్కానర్ ఆప్షన్​ ఉంటే పాస్​కీ క్రియేట్ చేయొచ్చు. పెన్​డ్రైవ్​లా ఉండే కొన్ని పాస్​కీస్ యూఎస్​బీ డ్రైవ్​లను కూడా వాడొచ్చు. ప్రజెంట్​ కొన్ని మొబైల్ యాప్​లకు ఫింగర్​ ప్రింట్ అథెంటికేషన్​లా గూగుల్ అకౌంట్​ పాస్​కీస్ పనిచేస్తాయి. వీటిని మర్చిపోతే, లేదా కొత్త డివైజ్​లో లాగిన్ అయ్యేటప్పుడు పాస్​వర్డ్ ఆప్షన్​ బదులు పాస్​కీస్ ఆప్షన్​ని సెలక్ట్ చేసుకోవచ్చు. దాంతో ఫింగర్ ప్రింట్, ఫేస్ స్కాన్​, పిన్​ సాయంతో లాగిన్​ అవ్వొచ్చు. దీనివల్ల లాభమేంటంటే.. ఇతరులు గూగుల్ అకౌంట్లను యాక్సెస్ చేయలేరు. ఈ ఫీచర్ వాడాలంటే, కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్ విండోస్ 11, యాపిల్ మ్యాక్​ఒఎస్​ వెంచురా ఒఎస్​లతో.. మొబైల్​లో అయితే, ఆండ్రాయిడ్ 9, ఐఒఎస్​ 16, అంతకంటే పై వెర్షన్ ఒఎస్​లతో పనిచేసేవై ఉండాలి.