2023లో టాప్ డౌన్ లోడ్ యాప్స్ ఇవే

2023లో టాప్ డౌన్ లోడ్ యాప్స్ ఇవే

గూగుల్ ప్లే స్టోర్ లో నిమిషానికో యాప్ షేర్ అవుతోంది. ఈ ఏడాది ముగుస్తున్నందున 2023లో అత్యంత ప్రజాదరణ పొందిన, అత్యధిత మంది డౌన్ లోడ్ చేసుకునన 5 ఆండ్రాయిడ్ యాప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

రీల్సీ రీల్ మేకర్ (Reelsy Reel Maker Video Editor)

ఈ డిజిటల్ జనరేషన్ లో రీల్స్ మేకింగ్ అనేది ఒక్కోసారి కెరీర్ ను కూడా సెట్ చేస్తోంది. కంటెంట్ క్రియేషన్ కోసం ఇప్పటికే వచ్చిన ఎన్నో యాప్‌లు మార్కెట్‌లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇక ఇటీవలి కాలంలో వచ్చిన ఈ రీల్సీ రీల్ మేకర్ కూడా యూజర్ ఫ్రెండ్లీగా అవతరించింది. ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్‌ పోస్ట్ చేసేందుకు యూజర్స్ కు ఇది సహాయపడుతుంది. యూజర్స్ వారి స్వంత కంటెంట్ క్లిప్‌లతో వీడియోలను క్రియేట్ చేయడానికి వీలుగా ట్రెండింగ్ టెంప్లేట్‌లను అందిస్తోంది.

రీల్సీ రేటింగ్, డౌన్‌లోడ్స్ (Reelsy rating, downloads)

ఇది జెడ్ ఇటాలియా యాప్‌లచే డెవలప్ అయింది. ఈ యాప్‌ పర్చేస్ బేస్ లో అంటే కొనుగోలు ప్రక్రియ ద్వారా నడుస్తుంది. దాదాపు 15వేల రివ్యూస్ తో 3.9 రేట్ ఉన్న ఈ యాప్ ను 5లక్షల యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.

మూడిస్టోరీ - మూడ్ ట్రాకర్ (Moodistory - Mood Tracker)

మూడిస్టోరీ అనేది మూడ్ ట్రాకర్ అండ్ ఎమోషన్ ట్రాకర్ యాప్. ఇది ఒక్క పదం కూడా రాయకుండా 5 సెకన్లలోపు మూడ్ ట్రాకింగ్ ఎంట్రీలను క్రియేట్ చేయడానికి యూజర్స్ కి అనుమతిస్తుంది. ఇందులో మీ మూడ్ లో వచ్చే హెచ్చు తగ్గుల గురించి తెలుసుకోవచ్చు,  మానసిక కల్లోలాలకు కారణాలను విశ్లేషించవచ్చు, సానుకూల మానసిక స్థితి కోసం పరిష్కారాలను కనుగొనవచ్చు. ఇది కలర్ కోడెడ్ తో యూజర్స్ మూడ్‌ వివరాలను వెల్లడిస్తుంది.

మూడిస్టోరీ రేటింగ్, డౌన్‌లోడ్స్ (Moodistory rating, downloads)

మూడిస్టోరీ మాటోఫ్ ల్యాబ్‌లను క్రియేట్ చేస్తుంది. ఇది పర్చేస్ బెస్డ్ యాప్‌. ఇది 4.3 రేటింగ్ తో 10వేల కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది.

వాయిడ్‌పెట్‌ గార్డెన్: మెంటల్ హెల్త్ (Voidpet Garden: Mental Health)

ఇది మెంటల్ హెల్త్.. అంటే మానసిక ఆరోగ్యానికి సంబంధించిన యాప్. యూజర్స్  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కృతజ్ఞతా భావాన్ని ఆచరించడం లేదా ప్రతికూల ఆలోచనలను రీఫ్రేమ్ చేయడం వంటిని సరదాగా ఆవిష్కరిస్తుంది.  

వాయిడ్‌పెట్‌ రేటింగ్, డౌన్‌లోడ్‌లు (Voidpet rating, downloads)

వాయిడ్‌పెట్‌ యాప్‌ పర్చేస్ బెస్డ్ యాప్. ఇది 9400 రివ్యూస్ తో 4.4 రేటింగ్ ను కలిగి ఉంది. ఇది 1లక్ష డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది.

థ్రెడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాప్

ఈ మెటా యాజమాన్యంలోని సామాజిక ప్లాట్‌ఫారమ్ Xకి పోటీగా వచ్చింది. టెక్స్ట్-ఆధారిత సంభాషణలపై ఇది దృష్టి సారిస్తుంది (పోస్ట్‌లలో చిత్రాలు, వీడియోలు లేదా లింక్‌లు కూడా ఉంటాయి). యూజర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరినీ ఆటోమెటిక్ గా ఫాలో కావచ్చు. క్షణాల్లోనే స్నేహితులను కనుగొనవచ్చు.

థ్రెడ్స్ రేటింగ్, డౌన్‌లోడ్స్ (Threads rating, downloads)

థ్రెడ్స్ ను ఇన్‌స్టాగ్రామ్ (మెటా) డెవలప్ చేసింది. ఇది2లక్షల 80వేల రివ్యూస్ తో 4.2 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది, 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది.

ఇన్ సైట్ జర్నల్ (Insight Journal: Learn & Grow)

ఈ జర్నలింగ్ యాప్ AI- పవర్డ్ ప్రాంప్ట్‌లను, అందులో వచ్చే సమస్యలను పరిష్కరించడంలో యూజర్స్ కు సహాయపడటానికి ఇన్ సైట్స్ ను అందిస్తుంది. ఇన్‌సైట్ జర్నల్ మార్గనిర్దేశం చేయడానికి ప్లేటో, థామస్ అక్వినాస్, వర్జీనియా వూల్ఫ్ వంటి ఆలోచనాపరుల వ్యక్తిత్వాన్ని స్వీకరించడంలో వ్యక్తులకు సహాయపడటానికి ఒక గురువుగా ఉంటుంది. యూజర్స్ సబ్‌స్క్రిప్షన్ లేకుండా కొన్ని ఎక్సర్ సైజ్ లను ప్రయత్నించవచ్చు, కానీ 3వేల 500 కన్నా ఎక్కువ పుస్తకాల నుండి పాఠాలను అన్‌లాక్ చేయడానికి వారికి ఇన్‌సైట్ ప్లస్ అవసరం.

ఇన్‌సైట్ జర్నల్: రేటింగ్, డౌన్‌లోడ్స్ (Insight Journal: Learn & Grow rating, downloads)

UofHappy, LLC ద్వారా డెవలప్ చేయబడిన ఈ యాప్ యాప్‌లో పర్చేసెస్ కూడా ఉంటాయి. 3.6 స్టార్ రేటింగ్ తో ఇది 10వేల కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది.