బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు రిటైర్మెంట్ ఇద్దాం : రాజాసింగ్​

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు రిటైర్మెంట్ ఇద్దాం : రాజాసింగ్​
  • గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​
  • మహబూబ్​నగర్, మక్తల్  బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పాలమూరు, అమరచింతలో రోడ్​ షో

పాలమూరు/మక్తల్, వెలుగు : బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బాయ్ బాయ్  చెప్పాల్సిన టైం వచ్చిందని, వారిని ఇంటికి పంపి రిటైర్మెంట్​ ఇద్దామని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన మహబూబ్​నగర్, మక్తల్​ బీజేపీ అభ్యర్థులు ఏపీ జితేందర్​రెడ్డి, జలంధర్​రెడ్డిలకు మద్దతుగా పాలమూరు, అమరచింతలో రోడ్​షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కారుకు ఓటేసి గెలిపిస్తే, కేసీఆర్​ కారు స్టీరింగ్ పాతబస్తీ లీడర్ల చేతిలో పెట్టాడని విమర్శించారు. తెలంగాణలో బీసీ సీఎం వచ్చాక బుల్డోజర్​తో అవినీతి ఆస్తులను కూల్చివేస్తామన్నారు. కమలం పువ్వు గుర్తు మీద ఓట్లు వేసి మిథున్, జలంధర్​లను గెలిపించాలని కోరారు. మిథున్​రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బీసీ సీఎం డిక్లేర్  చేశాక కేసీఆర్​కు మంట మండుతోందన్నారు.

ఈ నెల 3‌‌‌‌‌‌‌‌న మంత్రి శ్రీనివాస్​గౌడ్, కాంగ్రెస్​ క్యాండిడేట్​ శ్రీనివాస్​రెడ్డిలతో పాటు కేసీఆర్​కు బాయ్ బాయ్​ చెబుతామన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరారు. అమరచింతలో జలంధర్​రెడ్డి మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్​ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిద్దామన్నారు. కర్నాటకలో కాంగ్రెస్  అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక.. అమలు చేయలేక  చేతులెత్తేసిందన్నారు. ఇక్కడ అవే హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందన్నారు. కమలం పువ్వు గుర్తుపై ఓట్లు వేసి తనను గెలిపించాలని కోరారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్​రెడ్డి పాల్గొన్నారు.