యాదగిరిగుట్ట నారసింహుడి సేవలో ప్రభుత్వ చీఫ్ విప్

యాదగిరిగుట్ట నారసింహుడి సేవలో  ప్రభుత్వ చీఫ్ విప్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి నారసింహుడిని దర్శించుకుని, ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు.

స్వామివారి దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా, ఆలయ సూపరింటెండెంట్ రాజన్ బాబు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. ఇదిలాఉండగా, ఆలయంలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా బుధవారం ఆలయానికి రూ.11,98,769 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు..