ఎడ్యుకేషన్ పాలసీలో ప్రభుత్వ జోక్యం కనిష్టంగా ఉండాలి: మోడీ

ఎడ్యుకేషన్ పాలసీలో ప్రభుత్వ జోక్యం కనిష్టంగా ఉండాలి: మోడీ

న్యూఢిల్లీ: కొత్త విద్యా విధానంలో ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (ఎన్ ఈపీ)పై నిర్వహించిన గవర్నర్ ల కాన్ఫరెన్స్ సెషన్స్ ప్రారంభోత్సవంలో మోడీ ప్రసంగించారు. ‘దేశ ఆకాంక్షలను నెరవేర్చడంలో విద్యా విధానంతోపాటు విద్యా వ్యవస్థ చాలా కీలకమవుతాయి. విద్యా వ్యవస్థ బాధ్యతల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు భాగస్వామ్యం అవుతాయి. కానీ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రభుత్వ జోక్యం, ప్రభావం చాలా తక్కువగా ఉండాలి. విదేశీ విధానం, రక్షణ విధానాల మాదిరిగానే ఎడ్యుకేషన్ పాలసీ కూడా దేశానికి సంబంధించినదే కానీ ప్రభుత్వానిది కాదు. ఇది అందరిదీ’ అని మోడీ పేర్కొన్నారు.