ఆటల ప్రాచుర్యానికి సర్కార్ కృషి చేస్తోంది

ఆటల ప్రాచుర్యానికి సర్కార్ కృషి చేస్తోంది

న్యూఢిల్లీ: నేషనల్ స్పోర్ట్స్‌ డే సందర్భంగా ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన, దేశం గర్వించేలా చేసిన క్రీడాకారులను ప్రధాని మోడీ మెచ్చుకున్నారు. ఆటలను పాపులర్ చేయడానికి, స్పోర్టింగ్ ట్యాలెంట్‌ను గుర్తించడానికి ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోందని మోడీ శనివారం చెప్పారు. ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడటాన్ని, కసరత్తులు చేయడాన్ని తమ లైఫ్‌లో భాగం చేసుకోవాలని కోరారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మేజర్ ధ్యాన్‌ చంద్‌కు మోడీ నివాళులు అర్పించారు. హాకీ స్టిక్‌తో మ్యాజిక్‌ చేసిన ధ్యాన్‌ చంద్‌ విన్యాసాలు ఎప్పటికీ మర్చిపోలేనివన్నారు. ట్యాలెంటెడ్ అథ్లెట్లకు అద్భుతమైన మద్దతును ఇచ్చిన ఫ్యామిలీలు, కోచ్‌లు, సపోర్ట్‌ స్టాఫ్‌ సేవలను కూడా మోడీ ప్రశంసించారు.