GST News: ఆగస్టులో తగ్గిన జీఎస్టీ వసూళ్లు.. మెుత్తం రూ.లక్ష 86వేల కోట్ల కలెక్షన్స్..

GST News: ఆగస్టులో తగ్గిన జీఎస్టీ వసూళ్లు.. మెుత్తం రూ.లక్ష 86వేల కోట్ల కలెక్షన్స్..

August GST Collection: ప్రతినెల మాదిరిగానే ప్రభుత్వం సెప్టెంబర్ 1న ఆగస్టుకు సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను విడుదల చేసింది. ఈ క్రమంలో జూలై నెలతో పోల్చితే వసూళ్లు మందగించినట్లు తేలింది. అయితే గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే మాత్రం జీఎస్టీ కలెక్షన్ ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. 

ఆగస్టులో నెలవారీ ప్రాతిపధిక జీఎస్టీ వసూళ్లు 7.6 శాతం తగ్గి రూ.లక్ష 86వేల కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. జూలై నెలలో జీఎస్టీ కలెక్షన్స్ రూ.లక్ష 96వేల కోట్లుగా నిలిచాయి. అయితే స్వల్ప తగ్గుదల నమోదైనప్పటికీ జీఎస్టీ ఆగస్టు వసూళ్లు లక్ష 80వేల కోట్ల కంటే ఎక్కువగానే కొనసాగాయి. దీంతో వరుసగా 8వ నెల కూడా ఇదే స్థాయి కంటే ఎక్కువగా జీఎస్టీ స్థిరమైన నిలకడ వసూళ్లు కనిపించాయి. 

2024 ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష 75వేల కోట్లు ఉండగా.. ఏడాది ప్రాతిపధికన వసూళ్లు పాజిటివ్ ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అత్యధికంగా రూ.2లక్షల 37వేల కోట్ల వసూళ్లను జీఎస్టీ చూసింది. ఆ తర్వాత మార్చి నెలలో 2 లక్ష కోట్ల కంటే ఎక్కువగానే కలెక్షన్స్ కొనసాగాయి. అయితే దీని తర్వాతి నుంచి వసూళ్లు తగ్గుతూ మళ్లీ పెరుగుతూ కొనసాగుతున్నాయి.