చదువు చెప్పకుండా గిదేంపని..! నకిలీ విత్తనాల దందా చేస్తున్న.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్

చదువు చెప్పకుండా గిదేంపని..! నకిలీ విత్తనాల దందా చేస్తున్న.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ టీచర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది..పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడు అడ్డదారులు సంపాదించేందుకు సిద్దమయ్యాడు. నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేశాడు. నకిలీ విత్తనా దందా చేస్తున్న పెంచికల్ పేటకు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు సుబ్బారావును బుధవారం (మే) పోలీసులు అరెస్ట్ చేశారు. 

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సుబ్బారావు .. సైడ్ బిజినెస్ గా విత్తనాలు వ్యాపారం చేస్తున్నాడు. అయితే రైతులనుంచి పలు ఫిర్యాదు అందడంతో సుబ్బారావు ఇంటి, దుకాణంపై సోదాలు చేయగా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు నిర్ధారించారు. దాదాపు 12లక్షల విలువైన నాలుగు క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. సుబ్బారావుతోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. 

►ALSO READ | ఇకపై మరింత దూకుడు.. రేపే (మే 8) హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే