‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ జెండా ఎగరాలి. బడుగు..బలహీన వర్గాలకు కాంగ్రెస్ పెద్దపీట

‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ జెండా ఎగరాలి. బడుగు..బలహీన వర్గాలకు కాంగ్రెస్ పెద్దపీట
  •     ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

వేములవాడ/కోనరావుపేట, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ జెండా ఎగరాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌‌ పిలుపునిచ్చారు. వేములవాడ అర్బన్, రూరల్ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో ఆదివారం వేములవాడలో నిర్వహించిన మీటింగ్‌‌లో ఆయన మాట్లాడారు.

 బడుగు బలహీన వర్గాలకు ఎన్నికల్లో పెద్దపీట వేసేలా సీఎం రేవంత్‌‌రెడ్డి బీసీ రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో మరో పదేండ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. సమావేశంలో నాయకులు కాస శ్రీనివాస్,​ సంఘస్వామి, గాలిపెల్లి స్వామి, కదిరె రాజు, ఇటిక్యాల రాజు, వకుళాభరణం శ్రీనివాస్, రంగు వెంకటేశ్, సామ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం కోనరావుపేటలోని ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్‌‌లో జరిగిన మీటింగ్‌‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మామిడిపల్లి మాజీ సర్పంచ్ కొక్కుల నర్సయ్య-భారతి, విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు సంకోజి సత్తయ్య, శివంగలపల్లి మాజీ సర్పంచ్ సురేశ్‌‌తో పాటు మరో యాభై మంది ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరగా.. వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఫిరోజ్‌‌పాషా, కిసాన్‌‌ సెల్‌‌ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్‌‌రెడ్డి, సింగిల్‌‌ విండో చైర్మన్‌‌ బండ నర్సయ్య, మార్కెట్ కమిటీ వైస్‌‌ చైర్మన్‌‌ ప్రభాకర్ పాల్గొన్నారు.