రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తా : బీర్ల ఐలయ్య

రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తా : బీర్ల ఐలయ్య
  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 

యాదగిరిగుట్ట, వెలుగు : నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలను తీర్చడమే తన ప్రథమ కర్తవ్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గోదావరి జలాలతో నిండి అలుగు పారుతున్న యాదగిరిగుట్టలోని 'తోపుగాని చెరువు' ను శుక్రవారం ఆయన సందర్శించి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. 

ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆలేరు తలాపునే గోదావరి నీళ్లు ఉన్నా రైతుల పొలాలకు చుక్క నీరు అందలేదన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సాగునీటి కష్టాలను తొలగించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. 

సీహెచ్​సీలో గడువు ముగిసిన ఇంజక్షన్లు

యాదాద్రి,​ వెలుగు : ఆలేరు కమ్యూనిటీ హెల్త్​సెంటర్​లో గడువు ముగిసిన ఇంజక్షన్లు కన్పించడంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. యాదాద్రి జిల్లా ఆలేరు సీహెచ్​సీని ఆయన ఆకస్మికంగా విజిట్ చేశారు. 

ఈ సందర్భంగా ఎమర్జెన్సీ వార్డు వైపునకు వెళ్లి అక్కడే ఉన్న మెడిసిన్ పరిశీలించారు. పిల్లలకు సంబంధించిన ఇంజక్షన్​ను పరిశీలించగా దాని గడువు గత నెలలోనే ముగిసిపోయిందని గుర్తించారు. దీంతో గడువు ముగిసిన ఇంజక్షన్ ఇక్కడ ఎలా పెట్టారని డ్యూటీ డాక్టర్​ను ఆయన ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే సీరియస్​ యాక్షన్​ఉంటుందని హెచ్చరించారు.