మిస్టర్ హైడ్​లామమత..: గవర్నర్

మిస్టర్ హైడ్​లామమత..: గవర్నర్

కోల్​కతా: జూనియర్ డాక్టర్ ఘటనలో సీఎం మమతా బెనర్జీ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆరోపించారు. ప్రజల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా ఉండేందుకు సంచలన కామెంట్లు చేస్తున్నారన్నారు. రోమన్ చక్రవర్తిలా తన గళం వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. జెకిల్, మిస్టర్ హైడ్ (అపరిచితుడు మాదిరి)లా ప్రవర్తిస్తున్నారని చురకలంటించారు.

 ప్రభుత్వం, పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఈ కేసు విషయంలో నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎంను కోరినా పట్టించుకోలేదని తెలిపారు. ఈ దారుణమైన ఘటన వెనుక ఎవరున్నారనేది ప్రజలకు అర్థం అవుతున్నదని అన్నారు.