ట్రైబల్స్ హెల్త్​ను కాపాడుకోవాలి : గవర్నర్ తమిళి సై

ట్రైబల్స్ హెల్త్​ను కాపాడుకోవాలి : గవర్నర్ తమిళి సై

ట్రైబల్స్ హెల్త్​ను కాపాడుకోవాలి

జన్​ జాతీయ గౌరవ్ దివస్​లో గవర్నర్ తమిళి సై 

హైదరాబాద్, వెలుగు : ట్రైబల్స్ తమ హెల్త్​ను కాపాడుకోవాలని, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలని గవర్నర్ తమిళి సై సూచించారు. బుధవారం రాజ్ భవన్​లో ఆదివాసీ ఫ్రీడమ్ ఫైటర్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జన్​ జాతీయ గౌరవ్ దివస్​ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీ రాజ్ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే తో కలిసి గవర్నర్ పాల్గొన్నారు. ముందుగా ​బిర్సా ముండా చిత్రపటానికి నివాళి అర్పించారు.  రాష్ట్రంలో గిరిజనుల కోసం రాజ్ భవన్ పలు కార్యక్రమాలు చేపడుతోందని గవర్నర్​పేర్కొన్నారు. రెడ్ క్రాస్ , నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తో కలిసి న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నట్లు తెలిపారు.

ట్రైబల్స్ ను డెవలప్ చేయడానికి రాష్ట్రంలో ఆరు ఆవాసాలను దత్తత తీసుకున్నట్లు గవర్నర్ చెప్పారు. ఈ ప్రాంతాల్లో అంబులెన్స్ లు, పవర్ సప్లై, మౌలిక సదుపాయాలు పెంచడం, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పెంచే చర్యలు చేపడుతున్నట్లు తమిళిసై వెల్లడించారు. అనంతరం రాజ్ భవన్​లో ఏర్పాటు చేసిన ట్రైబల్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్​ను గవర్నర్ పరిశీలించారు. రగ్గులు, న్యూట్రిషన్ పుడ్​ను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ట్రైబల్స్ గుస్సాడీ డాన్స్ ను ప్రదర్శించారు.