గుడ్ న్యూస్: ఉజ్వల గ్యాస్ సబ్సిడీ పథకం.. మార్చి 25 వరకు పొడిగింపు..

గుడ్ న్యూస్: ఉజ్వల గ్యాస్ సబ్సిడీ పథకం.. మార్చి 25 వరకు పొడిగింపు..

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) సబ్సిడీని దాని లబ్ధిదారులకు మార్చి 2025 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ పై  300 రూపాయల సబ్సిడీ కొనసాగుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద పేద కుటుంబాలకు అందించే వంటగ్యాస్ సబ్సిడీని 14.2 కిలోల సిలిండర్ కు దఫాలుగా కేంద్రం 2023 అక్టోబర్ లో 300కి పెంచింది. లబ్ధిదారులకు ఏడాదికి 12 రీఫిల్ ల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.12వేల కోట్లు సబ్సిడీని అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 

రానున్న లోక్ సభ ఎన్నికల క్రమంలో  కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4శాతం డీఏ, డీయర్ నెస్ రిలీఫ్ ను పెంచుతూ కేబినెట్ నిర్ణయించింది. డీఏ పెంపుతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం పొందనున్నారు. 

ALSO READ :- త్వరలోనే ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు: మంత్రి పొన్నం

వీటితో పాటు మహారాష్ట్రలో కంటైనర్ పోర్ట్ ఏర్పాటుకు రూ. 75 వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ సమావేశంలో జనపనార కోసం ఎంఎస్ పీ ని క్వింటాల్ కు రూ. 5,335 లకు పెంచేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.