యూపీఐ ట్రాన్సాక్షన్లపై 0.3% ఫీజు!

యూపీఐ ట్రాన్సాక్షన్లపై 0.3% ఫీజు!
  • యూపీఐ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆపరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడానికి అయ్యే ఖర్చును ఇలా తట్టుకోవచ్చు
  • మర్చంట్లపై ఛార్జీలేస్తే ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ధరలు పెరిగే ఛాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఐఐటీ బాంబే స్టడీ వెల్లడి

న్యూఢిల్లీ: యూపీఐ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీని నడిపేందుకు, అవసరమయ్యే ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫండింగ్ అందించేందుకు ప్రభుత్వం యూపీఐ ట్రాన్సాక్షన్లపై 0.3 శాతం ఫీజు వేస్తే మంచిదని ఐఐటీ బాంబే ఓ స్టడీలో పేర్కొంది. ఈ ఫెసిలిటేషన్ ఫీజు ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్ల రెవెన్యూని  ప్రభుత్వం సేకరించగలదని అంచనావేసింది. ‘యూపీఐ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఛార్జీలు’ పేరుతో ఓ స్టడీని ఐఐటీ బాంబే విడుదల చేసింది. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీఐ తాజాగా వాలెట్ల నుంచి మర్చంట్లకు జరిగే యూపీఐ ట్రాన్సాక్షన్లపై 1.1 శాతం ఛార్జీ వేసిన విషయం తెలిసిందే. దీని ప్రభావాన్ని విశ్లేషించి ఈ స్టడీ చేసింది. డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా యూపీఐ నుంచి లేదా ప్రీపెయిడ్ వాలెట్ల నుంచి మర్చంట్లకు వచ్చే పేమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎటువంటి ఫీజు వేయొద్దని పేర్కొంది.

మర్చంట్లపై ఫీజులు వేయడం ద్వారా యూపీఐ నడపడానికయ్యే ఖర్చులకు ఫండ్స్ సేకరించొద్దని  తెలిపింది. ఇలా చేయడం ద్వారా మర్చంట్లు అమ్మే ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ధరలు పెరగొచ్చని, డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బ్యాంకుల నుంచి యూపీఐ చేసిన వారిపై కూడా ఈ ప్రభావం  ఉంటుందని అభిప్రాయపడింది. దీనికి బదులుగా యూపీఐని నడపడానికి ట్రాన్సాక్షన్లపై 0.3 శాతం ఫీజు వసూలు చేస్తే రూ.5,000 కోట్ల వరకు వస్తాయని లెక్కించింది. కాగా, ప్రస్తుతం యూపీఐ ఆపరేట్ చేస్తున్న ఏ బ్యాంక్ లేదా ప్రొవైడర్  యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఎటువంటి ఛార్జీలను వేయకూడదు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం కరెన్సీ ప్రింటింగ్ కోసం యావరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూ.5,400 కోట్లు ఖర్చు చేస్తోంది. మేనేజ్ చేయడానికి మరింత ఖర్చు పెడుతోంది. వీటితో పోలిస్తే యూపీఐపై చేసే ఖర్చు తక్కువగా ఉంది.