జీఎస్టీపై లాటరీ: రూ.కోటి వరకు గెలుచుకునే చాన్స్

జీఎస్టీపై లాటరీ: రూ.కోటి వరకు గెలుచుకునే చాన్స్

షాపులకు వెళ్లి కొనుగోలు చేసిన కస్టమర్లు చాలా మంది బిల్లు తీసుకునేందుకు  అంతగా ఆసక్తి చూపించరు. షాపు యజమానులు కూడా బిల్లు ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపరు. అదో పనిగా అనుకుంటారు. అయితే ఆ పద్ధతిని రూపుమాపేందుకు కేంద్రం సరికొత్త పథకం తీసుకువస్తోంది. జీఎస్టీపై లాటరీ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు బిల్లు అడిగి తీసుకునేలా వినియోగదారుడ్ని ప్రోత్సహించడమే కేంద్రం ఉద్దేశం. జీఎస్టీతో బిల్లు తీసుకునే ప్రతి వినియోగదారుడు ఈ లాటరీలో పాల్గొనవచ్చు. ఈ లాటరీలో భాగంగా వినియోగదారులు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు గెలుచుకోవచ్చు. వినియోగదారులు తమ జీఎస్టీతో తీసుకున్న బిల్లులను సంబంధింత వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. పరిమిత కాలవ్యవధిలో డ్రా ప్రక్రియ నిర్వహించి విజేతలను ప్రకటిస్తారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తిస్థాయి విధివిధానాలను కేంద్రం ఓ ప్రకటన ద్వారా ప్రకటించనుంది.