ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

హరీశ్ ​కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలి
ఫ్యాక్టరీ గేట్‌‌‌‌‌‌‌‌ ముందు బీజేపీ ధర్నా


గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో కాంట్రాక్టు ఉద్యోగం కోసం రూ.7 లక్షలు ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న ముంజ హరీశ్ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి పర్మినెంట్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగం ఇవ్వాలని బీజేపీ లీడర్లు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ కౌశిక హరి ఇచ్చిన ‘చలో ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ గేట్‌‌‌‌‌‌‌‌ ముందు లీడర్లు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు సోమనాథ్‌‌‌‌‌‌‌‌, అజయ్‌‌‌‌‌‌‌‌ను సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేయాలన్నారు. ధర్నాలో నియోజకవర్గ ఇన్​చార్జి మారం వెంకటేశ్, సాదుల రాంబాబు, పున్నం శశికుమార్‌‌‌‌‌‌‌‌,  నిమ్మరాజుల రవి, కళ్యాణ్, తోడేటి రవికుమార్, మేకల శ్రీనివాస్, నవీన్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌, సాదవేణి రాజు, పులి శ్రీనివాస్, మనోజ్ రెడ్డి, సాయినాథ్, మంద శ్రీనివాస్, రాకేష్, సందీప్ పాల్గొన్నారు. 

  • కరెంట్ షాక్ తో రైతు మృతి 
  • మరొకరి పరిస్థితి విషమం
  • పోస్టుమార్టంను అడ్డుకున్న కుటుంబ సభ్యులు

వెల్గటూర్,వెలుగు : ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి రైతు మృతి చెందగా మరొక రైతు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ధర్మపురి మండలం రాయపట్నం గ్రామానికి చెందిన గటిక చిన్నన్న(44) వ్యవసాయం చేసేవాడు. సోమవారం కొత్త పల్లె గ్రామ శివారులోని తన వరి పొలంలో ఎరువులు చల్లడానికి సహాయం కోసం తన బావ మరిది ముక్కెర బాబు(40)ను తీసుకొని వెళ్లాడు. ఎరువు చల్లుతున్న క్రమంలో చిన్నన్న కాలుకు వైర్ తగిలి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. కింద పడి కొట్టుకుంటున్న చిన్నన్నను చూసిన బావమరిది బాబు అతని దగ్గరికి వెళ్లాడు. దీంతో బాబుకు కూడా షాక్ తగిలి తీవ్రంగా గాయపడగా.. చిన్నన్న అక్కడికక్కడే మృతి చెందాడు. బాబును ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉంది. చిన్నన్నకు భార్య అమ్మాయి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మృతిపై అనుమానాలు..

చిన్నన్న పొలం పక్కనే ఉన్న ట్రాన్స్​ఫార్మర్​కు సెంట్రింగ్ వైర్ చుట్టి దానిని వరి పొలం మధ్యలో సుమారు 15 మీటర్ల వరకు వేయడంతో మృతిపై అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. దీంతో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించిన చిన్నన్న డెడ్ బాడీని పోస్టుమార్టం కానివ్వకుండా కుటుంబీకులు అడ్డుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు
కలెక్టర్ అనురాగ్ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు : ప్రజావాణి సమస్యల పరిష్కారంలో అలసత్వం తగదని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సిరిసిల్ల కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఓ దివ్యాంగుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి రాగా కలెక్టర్ ఆయన దగ్గరకు వచ్చి ఫిర్యాదు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ ఆఫీసర్ బాధ్యతగా మెలగాలన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి మొత్తం 30 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్లు బి.సత్యప్రసాద్, ఎన్. ఖీమ్యా నాయక్, డిస్ట్రిక్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

కరీంనగర్​ ప్రజావాణిలో 147 దరఖాస్తులు

కరీంనగర్​సిటీ:  ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి 147 దరఖాస్తులు వచ్చాయని అడిషనల్​కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి దరఖాస్తుదారులకు న్యాయం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్​కు సంబంధించి 42  దరఖాస్తులు, జిల్లా పంచాయతీ శాఖకు 12, ఇతర శాఖలకు 93 దరఖాస్తులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్​కలెక్టర్ గరిమా అగర్వాల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

నిధుల అవకతవకలపై కలెక్టర్ కు ఫిర్యాదు..

కోనరావుపేట:  మండలంలోని సుద్దాల జీపీ నిధుల అవకతవకలపై గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడున్నరేళ్లుగా సుద్దాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ డబ్బులు ఎస్టీఓలో జమ చేయడంలేదన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణంలో ఎలాంటి తీర్మానం లేకుండా రూ.లక్ష తీసుకొని ఇప్పటివరకు వాటి వివరాలు చెప్పలేదన్నారు. గ్రామంలో అసైన్డ్ ల్యాండ్ లో పెట్రోల్ బంక్ నిర్మాణానికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో, రామన్నపేట రోడ్డుకు కాల్వ మట్టిని పోసి బిల్లులు తీసుకున్న సర్పంచ్ పై, కార్యదర్శిపై విచారణ జరిపాలని ఫిర్యాదు చేశారు.  వారిలో గ్రామస్తులు కె.బాలరాజు, ఎన్. రవి, బి.రమేశ్, ఎస్.పర్శరాములు, సురేష్ తదితరులు ఉన్నారు.

వేతనాల కోసం కార్మికుల ధర్నా

కరీంనగర్ టౌన్, వెలుగు: తమకు 10 నెలలుగా ఇవ్వాల్సిన వేతనాలు వెంటనే విడుదల చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పు చేసి విద్యార్థులకు అన్నం పెడుతున్నామని, అందుకు అయ్యే ఖర్చులు  ఇప్పించాలని కోరారు. ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షులు బుచ్చన్న యాదవ్, తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సాయిలు, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేంద్ర, సహాయ కార్యదర్శి విజయలక్ష్మి పాల్గొన్నారు.

  • అధికారంలోకి రావడమే లక్ష్యం
  • ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాలి
  • ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి 

జగిత్యాల, వెలుగు: కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాంగ్రెస్ లక్ష్యమని, అందుకోసం ప్రతీఒక్కరూ సమన్వయం చేసుకుంటూ పని చేయాలని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి సూచించారు. సోమవారం జగిత్యాలలో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఐక్యత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్ ఏకపక్ష విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతోందన్నారు. అనంతరం మాజీ ఎంపీ మధుయాష్కీ మాట్లాడుతూ  కేంద్రంకొంత మంది బడా వ్యాపారులకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అడ్లూరి లక్ష్మణ్, వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

క్రీడలతో స్నేహభావం పెరుగుతుంది
ఎమ్మెల్యే సంజయ్ కుమార్  

జగిత్యాల, వెలుగు: క్రీడలతో స్టూడెంట్లలో స్నేహ భావం, మానసికోల్లాసం పెంపొందుతాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఖిలాలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోటీలను ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. అనంతరం స్టూడెంట్ లతో కలిసి టిఫిన్ చేశారు. స్కూల్ లో సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థుల కోసం గురుకుల స్కూళ్లు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య, భోజన వసతి కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజేందర్, టీఆర్ఎస్ మైనార్టీ శాఖ పట్టణాధ్యక్షుడు ఖాదర్ ముజాహిద్, పార్టీ పట్టణాఉపాధ్యక్షుడు రాజ్ కుమార్ పాల్గొన్నారు.   

పారమితలో.. 

కొత్తపల్లి:పద్మనగర్ పారమిత హెరిటేజ్ స్కూల్​లో సోమవారం జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. స్కూల్​ చైర్మన్ డాక్టర్ ఇ.ప్రసాదరావు మేజర్ ధ్యాన్​చంద్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి శారీరకంగా క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్స్ రశ్మిత, ప్రసూన, ప్రసాద్, వినోద్​రావు, ప్రిన్సిపల్ సంజయ్ భట్టాచార్య, ప్రోగ్రాం హెడ్ గోపీకృష్ణ పాల్గొన్నారు. 

హరీశ్​ఆత్మహత్య పాపం సర్కార్ దే
బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి 

హుజూరాబాద్​ వెలుగు: ఆర్ఎఫ్ సీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి హరీశ్​ఆత్మహత్య పాపం ముమ్మాటికీ కేసీఆర్ సర్కార్ దేనని, హరీశ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ప్రభుత్వాన్ని విడిచిపెట్టమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి  హెచ్చరించారు. హరీశ్ ఆత్మహత్య ఘటనపై బీజేపీ శంకరపట్నంలో మండల శాఖాధ్యక్షుడు చల్ల ఐలయ్య ఆధ్వర్యంలో  సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ మంత్రి, ఎమ్మెల్యేల ప్రమేయంపై ఆరోపణలు వస్తున్నా కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే వరకు పరిస్థితులు తలెత్తినా అనేకమంది బాధితులు గగ్గోలు పెడుతునా ప్రభుత్వానికి కనబడకపోవటం శోచనీయమన్నారు. హరీశ్ కుటుంబానికి రూ.50 లక్షలు చెల్లించి, బాధితుడి భార్యకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. దీక్షలో మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, లీడర్లు  శ్రీనివాస్ గౌడ్, నాగరాజు, జయచందర్,  గుర్రాల వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.