వేములవాడ రాజన్న కోడెలకు లంపి స్కిన్ వ్యాధి: విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ రాజన్న కోడెలకు లంపి స్కిన్ వ్యాధి: విప్ ఆది శ్రీనివాస్

వేముల వాడ రాజన్న ఆలయంలో  ఈ మధ్య  కోడేలు అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరమన్నారు విప్ ఆది శ్రీనివాస్.  వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలను సందర్శించిన ఆది శ్రీనివాస్.. గోశాలను పరిశీలించి, కోడెల ఆరోగ్య వివరాలు వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సీజనల్ వ్యాధులు వర్షా కాలం రావడంతో అందులో కొన్ని కోడెలకు లంపి స్కిన్ వ్యాధి వచ్చినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్పారన్నారు. భక్తులు సమర్పించిన కోడెలలో కొన్నింటికి లంపీ స్కిన్ వ్యాధి ఉండడంతో ఇతర కోడేలకు వ్యాపించిందన్నారు. 16 మంది వైద్య సిబ్బంది కోడెలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. 

కోడెల మృతి చాలా కలిసి వేసింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని అన్నారు ఆది శ్రీనివాస్. కోడె మొక్కు భక్తుల విశ్వాసానికి నమ్మకానికి ప్రతీక అయిన  రాజన్న ఆలయం కోడెల పై విపక్షాలు  రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. ఇప్పటికే ఇంచుమించు 18 నుండి 20 కోడెలు ఆనారోగ్యం భారీ నుంచి కుదుటపడి ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.   మొదటి దశలో   సుమారు 1000 కోడెలను రైతులకు పంపిణీ చేశామన్నారు ఆది శ్రీనివాస్. భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని కాపాడుతామని చెప్పారు.