జీపీ పర్మిషన్​..  మున్సిపల్​ టాక్స్ ఆఫీసర్ల తప్పుడు సర్వే రిపోర్టు 

జీపీ పర్మిషన్​..  మున్సిపల్​ టాక్స్  ఆఫీసర్ల తప్పుడు సర్వే రిపోర్టు 
  •   ఇబ్బంది పడుతున్న జనం
  •    స్పందించని ఆఫీసర్లు

జగిత్యాల,వెలుగు: మున్సిపాలిటీలో విలీనమైన గ్రామస్తులు కొందరు ఇండ్ల పర్మిషన్​.. హౌస్​ టాక్స్​ చెల్లింపులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  మున్సిపాలిటీ పరిధిలోని ఇండ్లకు మున్సిపల్​పర్మిషన్​ ఇవ్వాలి. గ్రామాల విలీనం సందర్భంగా ఆఫీసర్లు చేసిన తప్పిదంతో జగిత్యాలలో కొన్నిసర్వే నంబర్లకు  ఇంటి నిర్మాణం కోసం పంచాయతీలో పర్మిషన్​ తీసుకోవాల్సి వస్తోంది. 

2018 లో జీపీల విలీనం...

మున్సిపల్​శివారు ప్రాంతాలను మరింత అభివృద్ది చేయాలన్న సర్కార్ నిర్ణయం మేరకు 2018 లో చుట్టుపక్కల పంచాయతీలను విలీనం చేశారు. జగిత్యాల మున్సిపాలిటీలో లింగపేట పంచాయతీ పరిధిలోని 240 నుంచి 498 వరకు 1,019 నుంచి 1,200 వరకు, హస్నాబాద్ పంచాయతీలోని  971 నుంచి 1,018, 1,585 నుంచి 1,616 వరకు, 1,619 నుంచి 1,626 వరకు, 1,688 నుంచి 1,693 వరకు, 1,711 నుంచి 2,060 వరకు దరూర్ పంచాయతీలోని 41 నుంచి 109 వరకు, 297 నుంచి 375 వరకు, 378 నుంచి 394 వరకు, తిప్పన్నపేట పంచాయతీలోని 429 నుంచి 484 వరకు. 490 నుంచి 508 వరకు, తిమ్మాపూర్ పంచాయతీలోని 417 నుంచి 465 వరకు , మోతె పరిధిలోని 33 నుంచి 44, 200 నుంచి 211 వరకు, 221 నుంచి 229 వరకు , 231 నుంచి 327 వరకు, 342 నుంచి 641 వరకు, 644 నుంచి 673 సర్వే నంబర్లు మున్సిపాలిటీలో ఉన్నట్లు ఆఫీసర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆమేరకు ప్రభుత్వం గెజిట్​రిలీజ్​చేసింది.

ఆఫీసర్ల తప్పుడు సర్వే రిపోర్లు...

సర్కార్ ఆదేశాల మేరకు మున్సిపల్​లో విలీనానికి ఆస్కారం ఉండే గ్రామాల్లోని సర్వే నంబర్లను గుర్తించి మున్సిపాలిటీకి అప్పగించాల్సి ఉంది. ఈ మేరకు సీడీఎంఎ అప్రూవల్ తో అసెంబ్లీ తీర్మానం చేసి సచివాలయం నుంచి గెజిట్ రిలీజ్ చేస్తారని ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ.. రెవెన్యూ ఆఫీసర్లు చేసిన సర్వేలో జగిత్యాల శివారులోని మోతె పరిధిలోని 33 నుంచి 44 వరకు, 200 నుంచి 211 వరకు, 221 నుంచి  229 వరకు , 231 నుంచి 327 వరకు, 342 నుంచి 641 వరకు, 644 నుంచి 673 వరకు సర్వే నంబర్స్ ను కలుపుతున్నట్లు బల్దియా బాడర్ ను నిర్ణయిస్తూ నివేదికలో పొందుపరిచారు. బార్డర్​ సర్వే నంబర్ల తో పాటు వీటి పరిధిలోని సర్వే నంబర్లు కలిసే విధంగా నివేదికలు ఇవ్వకపోవడంతో ఇంకా గెజిట్ లో రావాల్సిన 33 నుంచి 45  వరకు , 359 నుంచి  572 వరకు, 574  నుంచి 576 వరకు, 583 నుంచి 641 వరకు, 643 నుంచి 673 సర్వే నంబర్స్ సర్కార్ రిలీజ్ చేసిన గెజిట్ లో రాలేదు. దీంతో బల్దియా తమ పరిధి కాదంటూ ఇండ్లను  పర్మిషన్స్ ఇవ్వడంలేదు.

పర్మిషన్ పంచాయతీలో..

రెవెన్యూ ఆఫీసర్లు బల్దియాలో విలీనం అయినట్లు ఇచ్చిన సర్వే రిపోర్టుకు అనుగుణంగా వచ్చిన గెజిట్ తో బల్దియా, రిజిస్ట్రేషన్ శాఖలు తలలు పట్టుకుంటున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ లో గెజిట్ లో నమోదైన సర్వే నంబర్లతో పాటు మిస్ అయిన సర్వే నంబర్లను బల్దియాకు చెందినవిగా నమోదయ్యాయి. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ రూల్స్ ప్రకారం బల్దియా పరిధిలోని భూములు మ్యుటేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ సమయంలోనే రిజిస్ట్రేషన్ అమౌంట్ తో కలిపి ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంటుంది. వివాదాస్పదంగా ఉన్న సర్వే నంబర్లకు సైతం బల్దియా కు ఆస్తిపన్ను చెల్లిస్తున్నారు. తీరా బల్దియా పర్మిషన్ కోసం అప్లే చేసుకుంటే తమ పరిధిలో కాదని.. బీపాస్ వెబ్ సైట్ లో సర్వే నంబర్లు చూపించడం లేదని, పర్మిషన్ ఇవ్వలేమని ఆఫీసర్లు చేతులేస్తున్నారు. మరి కొందరు పర్మిషన్​మోతె పంచాయతీలో తీసుకోవడంతో ఆదాయానికి గండి పడుతోంది.

మరో గెజిట్ వస్తేనే పరిష్కారం

గెజిట్ లో  మిస్ అయిన సర్వే నంబర్లను మున్సిపాలిటీ పరిధిలో చేర్చుతూ ఆరు నెలల క్రితం ఆఫీసర్లు నివేదికను సీడీఎంకు అందజేశారు. మరోసారి ఆసెంబ్లీ తీర్మానం చేసి గెజిట్ రిలీజ్ కావాల్సి ఉంది. గెజిట్ వస్తేనే శాశ్వత పరిష్కారం దొరుకుతుందని స్థానికులు వాపోతున్నారు. కానీ... ఆరు నెలలు గడిచినా ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ అమలుకు ముందే ఈ సర్వే నంబర్స్ కు చెందిన  గెజిట్ రిలీజ్ కావాల్సి ఉంది. తర్వాత గెజిట్ వచ్చిన ఫలితం లేకుండా పోతుందని పలువురు పేర్కొంటున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం...

గతంలో మున్సిపాలిటీ శివారు ప్రాంతాల్లోని పంచాయతీలకు చెందిన కొన్ని సర్వే నంబర్లను మెర్జ్​ చేశారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్​తో సర్వే నంబర్లు మున్సిపాలిటీలోకి రాలేదు. దీంతో మళ్లీ సర్వేచేసి సర్వే నంబర్స్ పై పూర్తి స్థాయి నివేదికను కలెక్టర్ కు అందజేశాం. త్వరలోనే గెజిట్ వచ్చే అవకాశం ఉంది. – టీపీఎస్ శ్యాంసుందర్, జగిత్యాల

ఇబ్బంది పడుతున్నారు..

గతంలో జరిగిన తప్పులను సవరించుకోవాలి. సర్వే నంబర్స్ తప్పిదంతో ఇంటి పర్మిషన్స్ రాక జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మున్సిపాలిటీ ఆదాయానికి గండి పడుతోంది. – అనుమల్ల జయశ్రీ, కౌన్సిలర్​