
కరీంనగర్ టౌన్,వెలుగు:పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని జీపీ కార్మికులు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జీపీ ఎంప్లాయూస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ లీడర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో కార్మికులు పండుగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జీపీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని, 51 జీవోను సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు, కార్యక్రమంలో సీఐటీయూ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాచర్ల మల్లేశం, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సహాయ కార్యదర్శి శంకర్, లక్ష్మీనారాయణ, శంకర్, సారయ్య, కొమురయ్య, సుధాకర్, సమ్మయ్య, రమేశ్ పాల్గొన్నారు.