తెలంగాణలో మండుతున్న ఎండలు

తెలంగాణలో మండుతున్న ఎండలు

తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత మొలవుతోంది. మధ్యాహ్నం వరకు ఎక్కువవుతోంది. ఎండలకు జనం ఇండ్లలోంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వేడి గాలులు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
 
పగటి ఉష్ణోగ్రతలు 36.5 నుంచి 41.9 డిగ్రీల మధ్య నమో‌ద‌వు‌తు‌న్నట్లు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని..అవసరం అయితే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రాకుంటే మంచిదని సూచిస్తోంది.