పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రారంభం

పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రారంభం

నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 4 లక్షల 63 వేల 839 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి పోలింగ్ అధికారులు 605 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. జూన్ 5న ఓట్లు లెక్కింపు ఉంటుంది.

ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దృష్యా ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది.ఈ ఎన్నికల్లో 52 మంది పోటీ పడుతుండగా... అందులో 38 మంది స్వతంత్రులే.  పల్లా రాజేశ్వర్ రెడ్డి తన రాజీనామ కారణంగా ఈ ఉప ఎన్నికలు వచ్చాయి.