హామీలు నెరవేర్చకుంటే అక్టోబర్ 2 నుంచి సమ్మె : చినపాక లక్ష్మీనారాయణ

హామీలు నెరవేర్చకుంటే అక్టోబర్ 2 నుంచి సమ్మె : చినపాక లక్ష్మీనారాయణ

నల్గొండ అర్బన్, వెలుగు :  ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే అక్టోబర్​ 2 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని జీపీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ చినపాక లక్ష్మీనారాయణ హెచ్చరించారు.  మంగళవారం  కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 34 రోజుల సమ్మె సందర్భంగా వేతనాల పెంపు, మల్టీపర్పస్ విధానం రద్దు చేయడంతో పాటు ఇతర సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ఇందుకోసం  15 రోజులు టైం కావాలని అడిగిందని గుర్తుచేశారు. 

Also Read : ప్రతి ఒక్కరికీ సొంతిళ్లు ఉండాలన్నదే కేసీఆర్ కల : తలసాని

గడువు దాటినా పట్టించుకోకపోవడంతోనే మళ్లీ సమ్మెకు సిద్ధమయ్యారన్నారు. కార్మికులవి గొంతెమ్మ కోరికలు కావని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.19 వేలు,  అర్హత కలిగిన వారిని రెగ్యులర్ చేయడం, రూ.10 లక్షల ప్రమాద బీమా మాత్రమే అడుగుతున్నారన్నారు. అక్టోబర్ 1 న చలో హైదరాబాద్ చేపట్టనున్నారని, అయినా స్పందించకుంటే  సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. 

జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక వినోద్ కుమార్, నేతలు చింతపల్లి బయన్న, పొన్న అంజయ్య,  నరసింహ, పి. సర్వయ్య,  జహీర్, సైదులు, మంగారెడ్డి, ఇరిగి ఎల్లేశ్, ఎరగాని లింగయ్య, కోటయ్య, సైదులు, ఎర్ర అరుణ, మరియమ్మ, హరికృష్ణ, స్వామి, యాదమ్మ పాల్గొన్నారు.